హాస్టల్ గర్ల్స్ రగడ, కోరిక తీర్చాలని మరోచోట (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు వనస్థలిపురంలోని ఓ ప్రయివేటు హాస్టల్లో బీహార్ అమ్మాయిలపై హాస్టల్ నిర్వాహకుల లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. తమపై నిర్వాహకులు, అతని స్నేహితులు అత్యాచారయత్నం చేశారని బీహార్‌కు చెందిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాయ్ ఫ్రెండ్స్‌తో వెళ్లేందుకు, మాట్లాడేందుకు నిరాకరించినందువల్లే తమపై ఫిర్యాదు చేశారని నిర్వాహకులు చెప్పారు.
మంగళవారం రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో హాస్టల్ వార్డెన్ నవనీత సోదరుడు నరేష్, అతని స్నేహితులు కొంతమంది మద్యం మత్తులో మొదటి అంతస్తులో ఉన్న తమ రూం వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారని, గది తలుపును పదేపదే కొట్టారని, దీంతో తమ స్నేహితులకు ఫోన్ చేస్తే నరేష్ గ్యాంగ్ గొడవకు దిగిందని ఆ బీహార్ యువతులు పోలీసులకు చెప్పారు. వారి వాదనను నిర్వాహకులు కొట్టి పారేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
మరోవైపు లైంగిక వాంఛ తీర్చాలని బలవంతం చేసిన కామాంధుడిపై ఓ మహిళ దాడి చేయడంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు. తిరుమలగిరి ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ తన తల్లి అంజమ్మ, కూతురుతో కలిసి అరుణ్ ఎన్‌క్లైవ్‌లో ఉంటున్నాడు. వృత్తిరీత్యా మేస్త్రీ. రెండు సంవత్సరాల క్రితం భార్య వదిలేయడంతో తల్లి, కూతురుతో కలిసి ఉంటున్నాడు. వారం క్రితం తల్లి సొంతూరుకు వెళ్లింది. ఆ సమయంలో లక్ష్మి అనే మహిళతో పరిచయం అయింది.
ఆ మహిళ ఒంటరి అని తెలియడంతో అంజమ్మ ఆమెను తన ఇంటికి తీసుకు వచ్చింది. లక్ష్మిని తన కొడుకు లక్ష్మణ్‌కు ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని అనుకుంది. అయితే సోమవారం రాత్రి లక్ష్మి, లక్ష్మణ్‌లు మద్యం సేవించారు. మద్యం మత్తులో లక్ష్మణ్ తన లైంగిక కోరిక తీర్చాలని లక్ష్మిని బలవంతం చేశాడు. ఆమె ససేమీరా అనగా, గంట తర్వాత మళ్లీ ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆగ్రహించిన మహిళ అతనిపై దాడి చేయడంతో గాయాలపాలైన లక్ష్మణ్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

బీహార్ 1
రాష్ట్ర రాజధాని హైదరాబాదు వనస్థలిపురంలోని ఓ ప్రయివేటు హాస్టల్లో బీహార్ అమ్మాయిలపై హాస్టల్ నిర్వాహకుల లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.

బీహార్ 2
తమపై నిర్వాహకులు, అతని స్నేహితులు అత్యాచారయత్నం చేశారని బీహార్‌కు చెందిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాయ్ ఫ్రెండ్స్‌తో వెళ్లేందుకు, మాట్లాడేందుకు నిరాకరించినందువల్లే తమపై ఫిర్యాదు చేశారని నిర్వాహకులు చెప్పారు.

బీహార్ 3
మంగళవారం రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో హాస్టల్ వార్డెన్ నవనీత సోదరుడు నరేష్, అతని స్నేహితులు కొంతమంది మద్యం మత్తులో మొదటి అంతస్తులో ఉన్న తమ రూం వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.

బీహార్ 4
గది తలుపును పదేపదే కొట్టారని, దీంతో తమ స్నేహితులకు ఫోన్ చేస్తే నరేష్ గ్యాంగ్ గొడవకు దిగిందని ఆ బీహార్ యువతులు పోలీసులకు చెప్పారు. వారి వాదనను నిర్వాహకులు కొట్టి పారేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

బీహార్ 5
హాస్టల్ ఘటన విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ శాసన సభ్యులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత సుధీర్ రెడ్డి విద్యార్థినులతో మాట్లాడారు.

దాడి 1
మరోవైపు లైంగిక వాంఛ తీర్చాలని బలవంతం చేసిన కామాంధుడిపై ఓ మహిళ దాడి చేయడంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు.

దాడి 2
తన లైంగిక కోరికను తీర్చాలని బలవంతం చేసిన కామాంధుడిపై ఓ మహిళ దాడి చేయడంతో అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు.












Click it and Unblock the Notifications