స్కేటింగ్ అదుర్స్: ఏడేళ్ల చిన్నారి అద్భుతం (పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాదుకు చెందిన ప్రణవ్ కళ్లకు గంతలు కట్టుకొని కీబోర్డు వాయిస్తూ స్కేటింగ్ చేస్తూ అద్భుత ప్రతిభ కనబర్చి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ప్రణవ్ వయస్సు ఏడేళ్లు.

శనివారం వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా కళ్లకు గంతల తో స్కేటింగ్ చేస్తూ కీబోర్డుపై 20 జాతీయ సమైక్యత, దేశభక్తి గీతాలు ప్లే చేశాడు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి తదితరులు బాలుణ్ని అభినందించారు.

ప్రణవ్ ప్రతిభకు మెచ్చి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యునిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తదితర సంస్థల ప్రతినిధులు రికార్డు ద్రువీకరణ పత్రాలు అందజేశారు.

ప్రణవ్

ప్రణవ్

హైదరాబాదుకు చెందిన ప్రణవ్ కళ్లకు గంతలు కట్టుకొని కీబోర్డు వాయిస్తూ స్కేటింగ్ చేస్తూ అద్భుత ప్రతిభ కనబర్చి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ప్రణవ్ వయస్సు ఏడేళ్లు.

ప్రణవ్

ప్రణవ్

తన ఈడు పిల్లలు ఆలోచన కూడా చేయని రీతిలో రికార్డు ఫీట్‌ను చేసి ఔరా అనిపించాడు ప్రణవ్. ఏకంగా ఏడు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

 ప్రణవ్

ప్రణవ్

భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్‌లో మూడోతరగతి చదువుతున్న ప్రణవ్ శనివారం వరల్డ్ మ్యూజిక్ డేను పురస్కరించుకుని కళ్లకు గంతలు కట్టుకుని స్కేటింగ్ చేస్తూనే కీబోర్డ్‌పై 20 జాతీయ సమైక్యత, దేశభక్తి గీతాలు ప్లే చేసి ఈ రికార్డులను సృష్టించాడు.

 ప్రణవ్

ప్రణవ్

కిషన్ రెడ్డి, బిజెపి గ్రేటర్ వైస్ ప్రెసిడెంట్ నందు, బీకేబీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఛైర్మన్ శ్రీనివాస్, బాల సాహిత్య పరిషత్ అధ్యక్షుడు వెంకటరమణ, ఆయా రికార్డు సంస్థల ప్రతినిధులు సాక్షులుగా నిలిచారు.

 ప్రణవ్

ప్రణవ్

శనివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన ఈ రికార్డుల ఫీట్ సరిగ్గా గంటసేపు కొనసాగింది. ప్రణవ్ ళ్లకు గంతలు కట్టుకొని కీబోర్డు వాయిస్తూ స్కేటింగ్ చేస్తూ అద్భుత ప్రతిభ కనబర్చాడు.

 ప్రణవ్

ప్రణవ్

బాల సాహిత్య పరిషత్, శ్రీ కళ్యాణి మ్యూజిక్ అకాడమీ సంయుక్తంగా 'వరల్డ్ రికార్డ్స్ రెయిన్ బో' శీర్షికన నిర్వహించిన ఈ ఈవెంట్‌లో ప్రణవ్ సాధించిన ఈ రికార్డు ఫీట్‌ను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యునిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ధృవీకరిస్తూ పత్రాలను అందజేశారు.

 ప్రణవ్

ప్రణవ్

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఈ ఫీట్‌ను పంపనున్నారు. వీటితోపాటు లిటిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా యోగ్యతా పత్రాలను అందజేశారు.

 ప్రణవ్

ప్రణవ్

ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులు ప్రణవ్‌ను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రణవ్‌ను వరల్డ్ రికార్డ్స్ వండర్ కిడ్ బిరుదుతో సత్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+