పిక్చర్స్: వ్యభిచారం చేస్తూ పట్టుబడిన జూనియర్ అర్టిస్ట్
హైదరాబాద్: వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ముఠాలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఉంది. హైదరాబాదులోని ఎల్బీ నగర్‌లో గల ఓ ప్రముఖ హోటల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌టివో), ఎల్బీ నగర్ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం తెల్లవారు జామున దాడి చేసి వ్యభిచారం ముఠాను పట్టుకున్నారు. ఆ హోటల్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం జరుగతోంది.

వ్యభిచారం చేస్తూ విజయవాడకు చెందిన ఓ బంగారు నగల దుకాణం యజమానికి పోలీసులకు చిక్కాడు. విజయవాడకు చెందిన ఎంకె జ్యుయెల్లర్స్ యజమాని వెంకటమురళీ కృష్ణ (45), సినిమాల్లో సైడ్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్న హైదరాబాదులోని ఫతేనగర్‌కు చందిన 23 ఏళ్ల జూనియర్ ఆర్టిస్టు దాడిలో పట్టుబడ్డారు.

పట్టుబడిన యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. వెంకటమురళీకృష్ణను రిమాండ్‌కు తరలించారు. హోటల్ మేనేజర్ శేఖర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యభిచారం నిర్వాహకురాలైన విజయవాడకు చెందిన మహిళను, జోగీశ్వర్ రావు (28) అనే ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం వారిని కోర్టులో హాజరు పరిచారు.
2013 డిసెంబర్‌లోనూ ఈ హోటల్‌లో వ్యభిచారం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో నిర్వాహకుడితోపాటు ఇద్దరు విటులు, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications