ఈ ఆరడుగుల బుల్లెట్ భారతంలో అర్జునుడు (పిక్చర్స్)
కర్నూలు: సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలలో భాగంగా కర్నూలులో నిర్వహించిన ఎపిఎన్జీవో సభ ఆదివారం విజయవంతమైంది. ఈ సభలో పలువురు సమైక్యవాదులు ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబును పలుమార్లు భారతంలో అర్జునుడు, ఆరడుగులు బుల్లెట్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
తెలంగాణ నేతలు అశోక్ బాబు ఎవరని అడుగుతున్నారని.. క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ శతకం కొడితే అతని పేరు మారుమోగిపోతుందని.. ఇప్పుడు అశోక్ పేరు అంతేనన్నారు. సమైక్యరాష్ట్రం కోసం తాము చేపట్టిన ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా ఇకమీదట తెలంగాణలోనూ సమైక్యసభలు నిర్వహిస్తామని చెప్పారు.
విభజనవాదులు చెబుతున్నట్టు తెలంగాణ ప్రజల్లో విడిపోవాలని ఏ కోశానా లేదన్నారు. కేవలం 40 శాతం మంది మాత్రమే విభజన కోరుతున్నారన్నారు. దీనికి కూడా విభజనవాదుల విద్వేష ప్రసంగాలే కారణమన్నారు. ప్రజల్లోలేని వాదాన్ని, కులాన్ని, మతాన్ని ఉపయోగించుకొని తెలంగాణ వారిని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఎపిఎన్జీవో సభ
సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాల్సిందేనని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కర్నూలు సభలో స్పష్టం చేశారు.

అశోక్ బాబు
రాజీనామా చేయని ఎంపీలపై అక్టోబర్ 1 నుంచి పెద్దఎత్తున ఒత్తిడి తెస్తామని, పదవుల కోసం ప్రజల మధ్యకు కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్న నేతలకు రాజకీయాలు అవసరమా? అని అశోక్ ప్రశ్నించారు.

ఎపిఎన్జీవో సభ 1
తెలంగాణ నేతలు హైదరాబాద్‌లో స్థాన బలంతో రెచ్చిపోతున్నారని, తమ విన్నపాన్ని పట్టించుకోకుండా కించపరిచేలా మాట్లాడితే తమ సత్తా ఏమిటో ఢిల్లీలో చూపాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఎపిఎన్జీవో సభ 2
రాష్ట్ర సమైక్యత కోసం 294 మంది ఎమ్మెల్యేలనూ స్వయంగా కలుస్తామని అశోక్ బాబు తెలిపారు. తెరాస నేతలతో కూడా ఈ విషయం చర్చించి సమైక్య రాష్ట్రం కోసం సహకరించాలని కోరతామన్నారు.

ఎపిఎన్జీవో సభ 3
రాజీనామా చేయని మంత్రులపై ఇకపై దాడులు చేసేది లేదని, వారిని సమైక్యవాదులు సన్మానిస్తారని అశోక్ బాబు ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.

ఎపిఎన్జీవో సభ 4
సమైక్య ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్న ప్రజలను చూడటానికి కూడా సాహసం చేయలేకపోతున్న నాయకులు సిగ్గు పడాలని అశోక్ బాబు అన్నారు.












Click it and Unblock the Notifications