లంబాడీలకు నమస్కారం పెట్టి, కేసీఆర్ పోజు (పిక్చర్స్)
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన వరాల విలువ దాదాపు రూ.27 వేల కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారట. ఇందులో రుణాల మాఫీ కింద ఒక్కసారి మాత్రమే పడే భారం రూ.17 వేల కోట్లు. మిగిలిన హామీల అమలుకు ఏటా దాదాపు రూ.10 వేల కోట్లు అవసరముంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.
బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి పంపిన నోట్‌లో ఆర్థిక శాఖ హామీల అమలుకు సంబంధించిన ప్రాథమిక అంచనాలు వివరించింది. పల్లె ప్రణాళికలు, మండల ప్రణాళికలు, జిల్లా ప్రణాళికలు, రాష్ట్ర ప్రణాళికలు ఖరారైతే తప్ప... వరాల వాస్తవ విలువ ఎంత అన్నది చెప్పలేమని ఆర్థిక శాఖ పేర్కొంది.
2014-15 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 10 నెలలకోసం రూపొందిస్తున్న బడ్జెట్‌పై ఆగస్టు మూడో వారానికల్లా కసరత్తు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కాగా, వరాలు కురిపించిన కేసీఆర్ పైన పలు వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లంబాడాలు కృతజ్ఞతలు తెలుపుతున్న దృశ్యం.

లంబాడాలు
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనను కలిసేందుకు వచ్చిన లంబాడాలకు నమస్కారం పెడుతూ...

లంబాడాలతో కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనను కలిసేందుకు వచ్చిన లంబాడాలతో ఫోటోకు ఫోజిచ్చిన దృశ్యం. పక్కన ఈటెల రాజేందర్.

కేసీఆర్ టీఎన్జీవోలతో.
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం టీఎన్జీవో నేతలతో మాట్లాడుతున్న దృశ్యం.

కేసీఆర్ టీఎన్జీవోలతో.
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం టీఎన్జీవో నేతలతో మాట్లాడుతున్న దృశ్యం.












Click it and Unblock the Notifications