అందాల యువతుల్ని వెలుగులోకి తెచ్చారు (పిక్చర్స్)
హైదరాబాద్: మాక్స్ సమర్పిస్తున్న హైదరాబాద్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ వేదిక మాక్స్ మిస్ హైదరాబాద్-2014 నగరంలో జరిగే ప్రతిష్టాత్మక బ్యూటీ ఉత్సవం. గత రెండు ఎడిషన్లలో సుందరమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ అందాల పోటీ, 2014 కోసం ఘనమైన ప్రారంభ సన్నాహాలు చేసుకుంటోంది.
అందమైన యువతుల ఎంపికలో భాగంగా ఫిబ్రవరి 1, 2014న ప్రిలిమినరీ ఆడిషన్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 19న జరిగే గ్రాండ్ ఫైనల్లో ఆకర్షణీయమైన వెన్నెల వెలుగులలాంటి హైదరాబాద్ యువతి ఎంపిక జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైన ఈ అందాల పోటీ మాక్స్ మిస్ హైదరాబాద్ 2014 యొక్క ప్రారంభం మరియు ఈవెంట్ పోస్టర్ విడుదల మంగళవారం జరిగింది.
పత్రికా సమావేశంలో ప్రేమ ఇష్క్ కాదల్ చిత్ర నటీనటులు, చిత్ర దర్శకులు పవన్ సాదినేని, ఫౌండర్ అండ్ సిఈవో శ్రీనివాస్ గుణిశెట్టి తదితరులు పాల్గొన్నారు. ఫ్యాషన్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమకంటూ ఓ స్థానాన్ని ఏర్పర్చుకున్న నికిత, రితూవర్మ, రికీ చటర్జీ, ఆర్తిసింగ్, తేజస్వి మొదలైన వారిని వెలుగులోకి తెచ్చిన ఈ ఉత్సవం, గ్లామర్ మరియు ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగిడాలనుకునే యువతులకు అనువైన వేదిక.

మాక్స్ 1
పంతొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఎంపిక కార్యక్రమం యువతులలో అందాన్ని వికసింప చేసి, సవాళ్లను ఎదుర్కొని, రంగుల ప్రపంచాన్ని గెలిచే ధైర్యాన్ని ఇస్తుంది.

మాక్స్ 2
శనివారం ఫిబ్రవరి 1న జరిగే ప్రిలిమ్స్ ఆడిషన్స్ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్, ఫిట్‌నెస్, మేక్ ఓవర్, స్టైలింగ్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కొరియోగ్రఫీ మొదలైన రంగాలలోని ప్రముఖులు, ఇందులో పాల్గొనే ప్రతి యువతికి తనను తాను నిరూపించుకొని, తనలో దాగి ఉన్న ప్రతిభకు పదును పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తారు.

మాక్స్ 3
మాక్స్ సమర్పిస్తున్న హైదరాబాద్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ వేదిక మాక్స్ మిస్ హైదరాబాద్-2014 నగరంలో ముగింపు ఉత్సవం ఫిబ్రవరి 19 తేదిన ఫ్యాషన్ ప్రపంచం మధ్యన జరగనుంది.

మాక్స్ 4
ఈ సందర్భంగా మాక్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పీయూష్ శర్మ మాట్లాడుతూ.. మాక్స్ మిస్ హైదరాబాదుతో మా భాగస్వామ్యం ఫ్యాషన్ పైన తమకు ఉన్న మక్కువను పునరుద్ఘాటిస్తూ షాపింగ్ ప్రియులకు మరియు ఆశక్తికర వినియోగదారులకు వారి శైలిని ప్రదర్శించేందుకు ఒక వేదకను సృష్టిస్తుందన్నారు.

మాక్స్ 5
ఈ భాగస్వామ్యం ద్వారా అంతర్జాతీయ ధోరణులను అర్థం చేసుకుంటూ భారతీయ తత్వానికి అనుగుణంగా మరింత ఎత్తుకు ఈ వేడుకను తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పీయూష్ అన్నారు.

మాక్స్ 6
ఫేజ్ 3 ఎంటర్‌టైన్మెంట్ ఫౌండర్ అండ్ సిఇవో శ్రీనివాస్ గుణిశెట్టి మాట్లాడుతూ.. నిదానం, అందం, ఆరోగ్యం, తెలివి మొదలైన లక్షణాల కలబోతగా కలిగిన ఆదర్శవంతమైన యువతే మిస్ హైదరాబాద్ అన్నారు.

మాక్స్ 7
హైదరాబాదులో ప్రతిభ గల యువతులకు కొరత లేదని, వారికి కావాల్సిందల్లా వారిలోని ప్రతిభను వెలికితీసే ఒక వేదిక అని గుణిశెట్టి శ్రీనివాస్ అన్నారు.

మాక్స్ 8
టాలీవుడ్ మరియు ఫ్యాషన్ పరిశ్రమ గుర్తించినట్టి మిస్ హైదరాబాద్, నగరంలో ఉత్సాహంగా జరిగే ఓ పెద్ద వేడుక అని శ్రీనివాస్ గుణిశెట్టి చెప్పారు.

మాక్స్ 9
కళామందిర్ సిఇవో కళ్యాణ్ అణ్మం మాట్లాడుతూ... హైదరాబాదు యువతకు తమలోని ప్రతిభను ప్రదర్సించి, ఫ్యాషన్ మరియు గ్లామర్ ప్రపంచంలో వారి కలలను సాకారం చేసుకునేందుకు చేయూతనందించే మిస్ హైదరాబాద్ 2014లో భాగస్వాములు కావడం తమకు గర్వంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications