సంకల్ప దీక్షలో ఖాళీ కుర్చీలు, ఓయు అటాక్ (పిక్చర్స్)
హైదరాబాద్: అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చిన నేపథ్యంలో దానిని నిరసిస్తూ, సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద శుక్రవారం ఉదయం సంకల్ప దీక్షను ఉదయం ప్రారంభించారు.
ఈ దీక్షలో పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, హర్ష కుమార్‌లు కూర్చున్నారు. వారికి మద్దతుగా మంత్రులు పార్థసారథి, గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు తదితరులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు దీక్ష స్థలికి వచ్చి మద్దతు తెలిపారు. దీక్ష నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్షను అడ్డుకునేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రయత్నించారు. ర్యాలీగా వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

సంకల్ప దీక్ష 1
సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు చేపట్టిన సంకల్ప దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సమైక్యాంధ్రవాదులు, ఇతర నేతల దృశ్యం.

సంకల్ప దీక్ష - 2
హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష వేదిక పైన విశ్రాంతి తీసుకుంటున్న నాయకులు, సమైక్యవాదులు.

సంకల్ప దీక్ష 3
అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చిన నేపథ్యంలో దానిని నిరసిస్తూ, సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద శుక్రవారం ఉదయం సంకల్ప దీక్షను ఉదయం ప్రారంభించారు.

సంకల్ప దీక్ష 4
హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద సంకల్ప దీక్షలో పాల్గొన్న ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరిలు సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్రాలు ప్రదర్శిస్తున్న దృశ్యం.

సంకల్ప దీక్ష 5
ఎంపీల దీక్షకు మద్దతుగా మంత్రులు పార్థసారథి, గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు తదితరులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. తెలుగు ప్రజా వేదిక మద్దతు దృశ్యం.

సంకల్ప దీక్ష 6
ఎంపీల దీక్షకు మద్దతుగా మంత్రులు పార్థసారథి, గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు తదితరులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. లంబాడీల మద్దతు దృశ్యం.

సంకల్ప దీక్ష 7
రాజధాని హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద సీమాంధ్ర ప్రాంత ఎంపీల సంకల్ప దీక్ష నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంకల్ప దీక్ష 8
ఎంపీల దీక్షకు మద్దతుగా మంత్రులు పార్థసారథి, గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు తదితరులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. దీక్షా ప్రాంగణంలో డాక్టర్ మిత్రతో లగడపాటి ముచ్చట్లు.

సంకల్ప దీక్ష 9
ఇందిరా పార్కు వద్ద సీమాంధ్ర ప్రాంత ఎంపీల సంకల్ప దీక్ష నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.

సంకల్ప దీక్ష 10
సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్షను అడ్డుకునేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రయత్నించారు. ర్యాలీగా వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

సంకల్ప దీక్ష 11
సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్షను అడ్డుకునేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యం.

సంకల్ప దీక్ష 12
సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్షను అడ్డుకునేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రయత్నించారు. ర్యాలీగా వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications