చెప్పినట్లు వింటే: సినిమాలపై పవన్ అల్టిమేటం(పిక్చర్స్)
విశాఖ/విజయనగరం: తండ్రీ కొడుకుల దోపిడీ వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని, ఎన్డీయే అధికారంలోకి వస్తే జగన్‌ను జైల్లో పెడతామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
శనివారం ఉత్తరాంధ్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించిన మాట్లాడారు. జగన్ లక్షకోట్లు దోచుకున్నాడని, ఎప్పటికైనా జైలుకెళ్లే జగన్ సిఎం కావాలా అని ప్రశ్నించారు.
సీమాంధ్రులను కించపర్చేలా కెసిఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రజాసేవ కోసమే ప్రచారం చేస్తున్నాని తెలిపారు. తెలుగు జాతి ఐక్యత కోసమే తన ప్రయత్నమన్న పవన్ తనకు పదవులు ముఖ్యం కాదన్నారు.

పవన్ కళ్యాణ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల సొమ్మే అన్నారు. ఓటును డబ్బుకు అమ్ముకోవద్దని ప్రజలను కోరారు. నిజాయితీగా టిడిపికి ఓటెయ్యండని పిలుపునిచ్చారు. మోడీ ప్రధాని అయితే దేశం బాగుపడుతుందన్నారు.

పవన్ కళ్యాణ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికీ పదవీకాంక్ష లేకుంటే ఆంధ్రప్రదేశ్ చీలి ఉండేది కాదని పవన్ కళ్యాణ్ శనివారం అన్నారు. జగన్ సొమ్ము జనానిదే అన్నారు.

పవన్ కళ్యాణ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటుకు రూ.పదివేలు ఇస్తే తీసుకొని... ఓటు మాత్రం బిజెపి, టిడిపి కూటమికి వేయాలన్నారు. జగన్‌కు జైలు అనుభవముంటే, చంద్రబాబుకు పాలనానుభవం ఉందన్నారు.

పవన్ కళ్యాణ్
తనకు పదవి అక్కర్లేదని, సామాన్యుడిగా ఉంటానని జగన్ అనుకుంటే రాష్ట్రం విడిపోయేది కాదన్నారు. ప్రస్తుత ఎన్నికలు తెలుగు జాతి ఐక్యకతకు పరీక్ష వంటివన్నారు.

పవన్ కళ్యాణ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఓడిస్తే తాను మళ్లీ ఉద్యమాలకు రానవసరం లేదని, సినిమాలు చేసుకుంటానని చెప్పారు. తాను సినిమాల్లో కొనసాగాలంటే జగన్ పార్టీని ఓడించాలన్నారు. లేదంటే తాను మళ్లీ ఉద్యమ బాటపట్టక తప్పదన్నారు.

పవన్ కళ్యాణ్
తాను సినిమాలు కొనసాగించాలంటే టిడిపి, బిజెపిలకు ఓటేయాలన్నారు. కెసిఆర్ పదేళ్లపాటు సీమాంధ్రులను నాలుకలు కోస్తా... చీరేస్తా అంటుంటే జగన్ ఎప్పుడు పల్లెత్తు మాట మాట్లాడలేదన్నారు. వారిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్నారు.

పవన్ కళ్యాణ్
వాడెవడో... అంటూ కెసిఆర్ చిటికెలు వేస్తూ తనను హెచ్చరించారని.. కానీ వాటికి తాను భయపడననన్నారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడానని తన పైన కేసులు పెట్టారని, రేపు హైదరాబాద్ వెళ్లాక జైల్లోను పెట్టవచ్చన్నారు.

పవన్ కళ్యాణ్
భౌతిక దాడులు చేసినా ఆశ్చర్యం లేదన్నారు. తాను వాటికి భయపడనన్నారు. కోపం వస్తే అభిమానులతో కలిసి సామూహికంగా నడిచి వెళ్తానని, తొక్కుకుంటూ వెళ్తామన్నారు.

పవన్ కళ్యాణ్
తనకు పదవులే కావాలనుకుంటే ప్రజారాజ్యం తరఫుననే పోటీ చేసే వాడినన్నారు. తనకు పాలనానుభవం లేనందునే జనసేన పార్టీని పెట్టినా పోటీ చేయడం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications