చరిత్రలో నిలిచిన కేసీఆర్: స్వామి ఆశీస్సులు(పిక్చర్స్)
హైదరాబాద్: మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామి శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి ఆశీర్వచనాలు అందించారు. తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందడుగు వేయాలని దీవించారు.
కేసీఆర్ అహర్నిశలూ శ్రమించి రాష్ట్రాన్ని సాధించి చరిత్రలో నిలిచిపోయారన్నారు. భగవంతుడి దయ, కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం ఎనలేని అభివృద్ధి సాధిస్తుందన్నారు.
తెలంగాణలోని యాదగిరిగుట్ట, బాసర, భద్రాచలం, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల్లో రాఘవేంద్ర స్వామి మఠాలు స్థాపించాలనుకుంటున్నట్టు తెలిపారు. గద్వాలలో చెన్నకేశవ స్వామి దేవాలయంలో రాముల వారి విగ్రహం ప్రతిష్టించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి మఠం కార్యక్రమాలన్నింటికీ సంపూర్ణ సహకారం అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

రాఘవేంద్ర మఠం స్వామి
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదులు శనివారం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను ఆశీర్వదించారు.

రాఘవేంద్ర మఠం స్వామి
తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందడుగు వేయాలని దీవించారు.

రాఘవేంద్ర మఠం స్వామి
శాస్త్రాల ప్రకారం ప్రభువుకు సంపద అంటే జనం ఆదరించడం, జనం మద్దతు పలకడం, జనం అభిమానించడమే అన్నారు. అలాంటి ఘనత కేసీఆర్ సాధించారన్నారు. వీరగడ్డ అయిన తెలంగాణలో కేసీఆర్ విశేష కృషితో, అహర్నిషలు శ్రమించి తెలంగాణ రాష్ట్రం సాధించి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారన్నారు.

రాఘవేంద్ర మఠం స్వామి
హిందూ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అభిమానం పెంచుకున్న కేసీఆర్‌లో దైవభక్తి మెండుగా ఉందని అభిప్రాయపడ్డారు. భగవంతుడి దయ, కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం ఎనలేని విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications