చల్లని సాయంకాలం.. వేడిగా, వారి సాహసం (పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాదులో మంగళవారం మరోసారి అకాల వర్షం కురిసింది. ఉదయం చిరుజల్లులు కురిసి, మధ్యాహ్నం కుండపోత వర్షం కురవటంతో నిత్యం రద్ధీగా ఉండే పలు రహదార్లన్నీ గోదార్లను తలపించాయి.

అంతేగాక, గత కొద్దిరోజులుగా ప్రతిరోజు వర్షాలు కురుస్తుండటంతో పలు లోతట్టు ప్రాంతాల్లో క్రమంగా నీరు చేరుతుండటంతో స్థానికులు ఆందోళభ వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో చిరుజల్లులుగా కురిసిన వర్షం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు కుండపోత వర్షంగా రూపు దాల్చింది. పలు జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది.

చల్లని వర్షంలో వేడి వేడి మొక్కజొన్న పొత్తు

చల్లని వర్షంలో వేడి వేడి మొక్కజొన్న పొత్తు

రాజధాని హైదరాబాదులో విచిత్రంగా ఈ కాలంలో వర్షం పడుతోంది. వడగళ్లు కూడా పడుతున్నాయి. నగరంలోని మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

నీట మునిగిన రోడ్డు

నీట మునిగిన రోడ్డు

పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. దీంతో రోడ్లన్ని జలమయం కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మునిగిన రోడ్డు

మునిగిన రోడ్డు

ఉప్పల్, తార్నక, సికింద్రాబాద్, బేగంపేట్, కొండాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎపుడూ ఊహించిన విధంగా పెద్ద పెద్ద వడగళ్లతో వర్షం పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కొబ్బరి బొండాలకు నో

కొబ్బరి బొండాలకు నో

జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో కూడా వడగండ్ల వాన కురిసింది. వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల నగరంలో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతంలోకి వర్షపు నీరు రావడంవల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కూలిన చెట్టు

కూలిన చెట్టు

బోరబండా, యూసుప్‌గూడ, అడ్డగుట్ట ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో పలు చోట్ల మంగళవారం ఉదయం వడగండ్ల వాన కురిసింది.

వర్షంలోనే..

వర్షంలోనే..

అకాల వర్షంతో మిరప, మొక్కజొన్న, పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటి ల్లింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.

వర్షంలో...

వర్షంలో...

ధర్మసాగరం, ములుగు, ఏటూరు నాగారం, చేర్యాల, నల్లబెల్లిలో కురిసిన భారీ వర్షాలకు మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం ఏర్పడింది.

ఇళ్లలోకి నీరు

ఇళ్లలోకి నీరు

కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు కూడా చేరింది. అంతేగాక, వాహనాల రాకపోకలతో కిటకిటలాడే ప్రధాన రహదార్లన్నీ కూడా గోదారిని తలపింపజేశాయి.

వ్యాపారుల బాధలు

వ్యాపారుల బాధలు

అడుగడుగున వాహనదారులకే గాక, పాదచారులకు కూడా ఇబ్బందులు తప్పలేదు. ఇప్పటికే వాటర్ స్టాగినేషన్ పాయింట్లను జిహెచ్‌ఎంసి అధికారులు గుర్తించినా, కొద్దిరోజులుగా తరుచూ వర్షాలు కురుస్తున్నా, సహాయక చర్యలపై దృష్టి సారించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

పంట నష్టం

పంట నష్టం

చినుకుపడితే చాలు చిన్నసైజు చెరువును తలపింపజేసే మహావీర్ ఆస్పత్రి బస్టాపు, హోటల్ వుడ్‌లాండ్ ముందున్న రహదారితో పాటు, రాణిగంజ్ చౌరస్తా, బైబిల్‌హౌజ్ రైల్వే బ్రిడ్జి కింద చౌరస్తా, పంజాగుట్ట, ఖైరతాబాద్ చౌరస్తాలు, అలాగే ఎం.జె.మార్కెట్ చౌరస్తాల్లో మొకాలిలోతు వరకు నీరు నిలిచి ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తాయి.

రోడ్డుపై

రోడ్డుపై

లక్డీకాపూల్ చౌరస్తా, ఉప్పల్, లంగర్‌హౌజ్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, ఎం.జె.మార్కెట్, మాసాబ్‌ట్యాంక్, పంజాగుట్ట, ఖైరతాబాద్ చౌరస్తాల్లో దాదాపు గంటల సేపు వాహనాలు క్యూ కట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

ట్రాఫిక్ జాం

ట్రాఫిక్ జాం

అలాగే రాణిగంజ్ చౌరస్తాలో భారీగా వర్షపు నీరు నిల్వటంతో అటు రాణిగంజ్, ఇటు అప్పర్‌ట్యాంక్‌బండ్‌లపై భారీగా ట్రాఫిక్ నిల్చిపోయింది.

వర్షంలోనే

వర్షంలోనే

అంతేగాక, మున్ముందు సుమారు వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయటంతో నగరవాసులు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

బండిపై గొడుగుతో

బండిపై గొడుగుతో

గతంలో నీట మునిగిన నాగమయ్యకుంట, టోలీచౌకీ నదీంకాలనీల్లో కూడా మంగళవారం మధ్యాహ్నం వర్షంతో భారీగా వర్షపు నీరు చేరింది.

కూకట్ పల్లిలో..

కూకట్ పల్లిలో..

మెట్రో పనులతో మరిన్ని అవస్థలు : ఒకవైపు నగరంలో చురుగ్గా సాగుతున్న మెట్రోపనులతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులెదుర్కొంటున్న వాహనదారులకు వర్షం కారణంగా కష్టాలు మరింత రెట్టింపయ్యాయి.

చిన్నారుల సాహసం!

చిన్నారుల సాహసం!

పనులు శరవేగంగా జరుగుతున్న ఉప్పల్ చౌరస్తా, బేగంపేట, సంజీవరెడ్డినగర్‌కాలనీ, పంజాగుట్ట, ఎంజెమార్కెట్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం వర్షం కురుస్తున్నపుడు, ఆగిన తర్వాత కూడా రాత్రి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ అవస్థలు తప్పలేదు.ఎప్పటికపుడు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు మెట్రోరైలు అధికారులుప్రయివేటుగా మార్షల్స్‌ను నియమించినా వాహనాల రద్ధీని అదుపు చేయలేకపోయారు.

నిజామాబాదులో...

నిజామాబాదులో...

అకాల వర్షంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తీవ్రంగా పంట నష్టం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రాంతంలో నేలకు ఒరిగిన పంట దృశ్యం.

రాజ్ భవన్ రోడ్డులో...

రాజ్ భవన్ రోడ్డులో...

హైదరాబాదులో మంగళవారం మరోసారి అకాల వర్షం కురిసింది. ఉదయం చిరుజల్లులు కురిసి, మధ్యాహ్నం కుండపోత వర్షం కురవటంతో నిత్యం రద్ధీగా ఉండే పలు రహదార్లన్నీ గోదార్లను తలపించాయి.

రాజ్ భవన్

రాజ్ భవన్

హైదరాబాదులో మంగళవారం మరోసారి అకాల వర్షం కురిసింది. ఉదయం చిరుజల్లులు కురిసి, మధ్యాహ్నం కుండపోత వర్షం కురవటంతో నిత్యం రద్ధీగా ఉండే పలు రహదార్లన్నీ గోదార్లను తలపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+