నిమజ్జనంలో గర్ల్స్ హంగామా: తడిసి, ముద్దై(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. బుధవారం మూడో రోజు కాబట్టి పలువురు వినాయక విగ్రహాలను నగరంలోని పలు చెరువులలో నిమజ్జనం చేశారు. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని వివిధ చెరువులలో వినాయక నిమజ్జనం జరిగింది.
మూడు రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథులను ఆయా మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో మేళతాళాల మధ్య బుధవారం నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాదు పరిధిలో 90, సైబరాబాద్ పరిధిలో 70 విగ్రహాలను నిమజ్జనం చేశారని పోలీసులు చెప్పారు.
కూకట్‌పల్లి నిజాంపేట రోడ్డులోని రిషీ వుమన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. విద్యార్థినులు నిమజ్జన కార్యక్రమంలో ఆనందంగా పాల్గొన్నారు. తమ ఆట - పాటలతో అలరించారు.

యువతి డ్యాన్స్
నిజాంపేటలోని రిషీ వుమన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా గణనాథుడిని ఊరేగింపుగా తీసుకు వెళ్తున్న సందర్భంగా నాట్యం చేస్తున్న విద్యార్థిని.

గణనాథుడికి వందనం
వినాయక నిమజ్జనం సందర్భంగా నిజాంపేటలోని రిషీ వుమన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గణనాథుడిని ఊరేగింపుగా తీసుకు వెళ్తుండగా విద్యార్థినిల వందనం.

హంగామా
హైదరాబాదులోని నిజాంపేటలోని రిషీ వుమన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా అమ్మాయిల హంగామా.

హంగామా 2
హైదరాబాదులోని నిజాంపేటలోని రిషీ వుమన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా అమ్మాయిల హంగామా, ఆనందం.

కెమెరాల్లోకి గణపతి
నిజాంపేటలోని రిషీ వుమన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపుగా వెళ్తున్న గణనాథుడిని తమ కెమెరాల్లో బంధిస్తున్న యువతులు.

ఆట-పాట
హైదరాబాదులోని రిషీ ఇంజినీరింగ్ కళాశాలలో నిమజ్జనం కోసం గణనాథుని తీసుకు వెళ్తున్న సమయంలో కళాశాల విద్యార్థినుల ఆట-పాట.

ఉట్టికొడుతున్న దృశ్యం.
రిషీ ఇంజనీరింగ్ కళాశాలలో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉట్టి కొడుతున్న కళాశాల విద్యార్థినుల దృశ్యం.

యస్.. నేను కొట్టాను!
నిజాంపేటలోని రిషీ ఇంజినీరింగ్ కళాశాలలో గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా విద్యార్థినులు ఉట్టికొట్టి సంబరం చేసుకున్నారు. ఉట్టి కొట్టిన ఆనందంలో యువతి.

తడిసి ముద్దై...
గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా నిజాంపేటలోని రిషీ ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్స్ ఉట్టి కొట్టారు. ఈ సమయంలో తడిసి ముద్దైన యువతులు.

నేనూ కొట్టాను!
నిజాంపేటలోని రిషీ ఇంజినీరింగ్ కళాశాలలో గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా విద్యార్థినులు ఉట్టికొట్టి సంబరం చేసుకున్నారు. ఉట్టి కొడుతున్న యువతి.

నీళ్లు జల్లుతున్న దృశ్యం.
గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా నిజాంపేటలోని రిషీ ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్స్ ఉట్టి కొట్టారు. ఈ సమయంలో ఉట్టికొడుతున్న యువతిపై నీళ్లు జల్లుతున్న దృశ్యం.












Click it and Unblock the Notifications