ఇద్దరు భార్యలు ముద్దు, బైక్‌పై హరీష్ రావు (పిక్చర్స్)
హైదరాబాద్: రాజధానిలోని నిజాం కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన సకల జన భేరీ సభ విజయవంతమైంది. తెలంగాణ ఏర్పాటు ఖాయమని, ఈ దశలో తెలంగాణ ఏర్పాటును దేవుడు కూడా అడ్డుకోలేడని తెలంగాణ రాజకీయ జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో నేతలు ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పాటు ఖాయం అనే సందేశాన్ని ఈ సభ ద్వారా తెలంగాణకు పంపించారు. లక్షమంది జగన్, చంద్రబాబు, కిరణ్‌లు వచ్చినా తెలంగాణ ఏర్పాటును ఆపలేరంటూ ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, న్యూ డెమోక్రసీ పార్టీతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నేతలంతా తెలంగాణ ఏర్పాటుపై పూర్తి ధీమా వ్యక్తం చేశారు.
ఈ సభలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ పలుమార్లు డిజిపి దినేష్ రెడ్డి పీడ విరగడైందంటూ వ్యాఖ్యానించారు. తనను డిజిపిగా కొనసాగించాలన్న దినేష్ రెడ్డి పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసి కోదండ పలుమార్లు ఆ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిజెపిని భుజానికెత్తుకున్నారు.

ద్విచక్ర వాహనాలపై
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన సకల జన భేరీకి భారీ సంఖ్యలో తెలంగాణవాదులు హాజరయ్యారు. ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వస్తున్న తెలంగాణవాదులు.

56 ఏళ్ల పోరాటం
సీమాంధ్ర ఉద్యమానికి నటీనటులు కావలెను అంటూ సకల జన భేరీలో సభ ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న తెలంగాణవాదులు.

హైదరాబాద్ సిర్ఫ్ హమారా
హైదరాబాద్ సిర్ఫ్ హమారా అంటూ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేస్తున్న తెలంగాణ మహిళా ఐక్యకార్యాచరణ కమిటీ.

బతుకమ్మ
గునుగు పూల మీద గూకునే గౌరమ్మ.. అదే మా బతుకమ్మ అంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్న తెలంగాణ మహిళా ఐక్యకార్యాచరణ కమిటీ.

హైదరాబాద్ మాదే
హైదరాబాద్ సిర్ఫ్ హమారా అంటూ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేస్తున్న తెలంగాణ మహిళా ఉపాధ్యాయ సమాఖ్య సభ్యులు.

ఆత్మగౌరవ వేదిక
హైదరాబాద్ సిర్ఫ్ హమారా అంటూ అసెంబ్లీ ఎదుట గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేస్తున్న తెలంగాణ ఆత్మ గౌరవ వేదిక సభ్యులు.

సకల జన భేరీ
తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ సకల జన భేరీకు తరలి వెళ్తున్న తెలంగాణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐకాస.

ఇద్దరు భార్యలు ముద్దు..
ఇద్దరు భార్యలు ముద్దు.. రెండు రాష్ట్రాలు ఎందుకు వద్దు అంటూ తెలంగాణ ఆజాద్ ఫోర్స్ ఆధ్వర్యంలో అమర వీరుల స్థాపం వద్ద ధర్నా దృశ్యం.

పుష్పగుచ్ఛం
అసెంబ్లీ ఎదుట గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించి అనంతరం జై తెలంగాణ నినాదాలు చేస్తున్న దృశ్యం.

హరీష్ రావు
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన సకల జన భేరీకి భారీ సంఖ్యలో తెలంగాణవాదులు హాజరయ్యారు. ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వస్తున్న హరీష్ రావు.

విమలక్క
నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన సకల జన భేరీకి భారీ సంఖ్యలో తెలంగాణవాదులు హాజరయ్యారు. అమరవీరుల స్థూపం వద్ద నుండి విమలక్క.

సాంస్కృతిక ప్రదర్శన
హైదరాబాదులోని నిజాం కశాళాల మైదానంలో ఏర్పాటు చేసిన సకల జన భేరీ సభలో సాంస్కృతిక కళాకారుల ప్రదర్శన దృశ్యం. వారు ఆట పాటలతో అలరించారు.

ఆకర్షణ
హైదరాబాదులోని నిజాం కశాళాల మైదానంలో ఏర్పాటు చేసిన సకల జన భేరీ సభలో సాంస్కృతిక కళాకారుల ప్రదర్శన దృశ్యం. వారు ఆట పాటలతో అలరించారు.

బతుకమ్మ
నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు బతుకమ్మలతో వస్తున్న మహిళలు.

శ్రవణ్ నాట్యం
హైదరాబాదులోని నిజాం కశాళాల మైదానంలో ఏర్పాటు చేసిన సకల జన భేరీ సభలో సాంస్కృతిక కళాకారుల పాటకు డ్యాన్స్ చేస్తున్న తెరాస నేతలు.

రసమయి బాలకిషన్
హైదరాబాదులోని నిజాం కశాళాల మైదానంలో ఏర్పాటు చేసిన సకల జన భేరీ సభలో సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలో రసమయి బాలకిషన్ పాట

ఒళ్లంతా తెలంగాణం
హైదరాబాదులోని నిజాం కశాళాల మైదానంలో ఏర్పాటు చేసిన సకల జన భేరీ సభలో ఒళ్లంతా తెలంగాణంతో నింపుకున్న అభిమాని.

తెరాస మహిళలు
హైదరాబాదులోని నిజాం కశాళాల మైదానంలో ఏర్పాటు చేసిన సకల జన భేరీ సభలో సాంస్కృతిక కళాకారుల పాటకు డ్యాన్స్ చేస్తున్న తెరాస మహిళా నేతలు.

వేదిక
నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మహాసభలో వేదిక పైన లంబాడీ మహిళలు, తెలంగాణ ఉద్యోగ సంఘాల, ఇతర నేతలు.

చిన్నారి పాట
సకల జన భేరీ సభలో తెలంగాణ పాట పాడుతున్న ఓ చిన్నారి. ఆమె పాటకు రసమయి బాలకిషన్ చప్పట్లు కొడుతూ ఉత్సాహం నింపుతున్న దృశ్యం.

సకల జన భేరీ
నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన సకల జన భేరీకి తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ సమితి తరలి వస్తున్న దృశ్యం.

న్యాయవాదులు
బందిపోటు సీమాంధ్ర నాయకులను తరిమికొట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామంటూ ప్లకార్డులు పట్టుకొని సభకు వస్తున్న న్యాయవాదులు.

పిడిఎస్‌యు
నిజాం కళాశాలలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సకల జన భేరీకి తరలి వస్తున్న పిడిఎస్‌యు, సిపిఐఎంల్ న్యూడెమోక్రసీ.

పోతురాజు
తెలంగాణకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా పోతురాజులు అలరిస్తారు. సభకు వారి వేషధారణలో వచ్చిన తెలంగాణవాదులు.

కెసిఆర్ మాస్కులతో
సకల జన భేరీకి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాస్కులతో వస్తున్న తెరాస కార్యకర్తలు.

కెసిఆర్
హైదరాబాదులోని సభకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాస్కులతో వస్తున్న తెరాస కార్యకర్తలు.

వాహనాలు
తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో జరిగిన సకల జన భేరీకి పది జిల్లాల నుండి తెలంగాణవాదులు వాహనాలలో తరలి వచ్చారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన వాహనాలు.

కోదండరామ్, ఇతరులు
హైదరాబాదులోని నిజాం కళాశాలలోని సకల జన భేరీకి హాజరైన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, ఇతర నాయకులు.

జన సందోహం
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సకల జన భేరీకి తరలి వచ్చిన తెలంగాణవాదులు

తెరాస నేతలు
హైదరాబాదులోని నిజాం కళాశాలలోని సకల జన భేరీకి హాజరైన తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కెటి రామారావు తదితరులు.

మహిళా న్యాయవాదులు
హైదరాబాదులోని నిజాం కళాశాలలోని సకల జన భేరీకి హాజరైన రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సమితి నాయకులు.

బెలూన్
నిజాం కళాశాల మైదానంలోని సకల జన భేరీ సభ ప్రాంగణంలో బెలూన్ ఎగరవేసిన దృశ్యం. ఈ సభ విజయవంతమైంది. జిల్లాల నుండి తెలంగాణవాదులు తరలి వచ్చారు.

కోదండరామ్
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సకల జన భేరీ సభలో మాట్లాడుతున్న కోదండరామ్ దృశ్యం.

కెసిఆర్
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సకల జన భేరీ సభలో మాట్లాడుతున్న తెరాస అధ్యక్షుడు దృశ్యం.












Click it and Unblock the Notifications