వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంద రోజులుగా..: ఎంపి శివ ప్రసాద్ వేషాలు! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం గురువారం వంద రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో సీమాంధ్రలోని పలు జిల్లాల్లో వినూత్నంగా నిరసన తెలిపారు. పలుచోట్ల సమైక్యాంధ్ర ఉద్యమం వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సమైక్యవాదులు 100 సంఖ్య రూపంలో కూర్చొని నిరసన తెలిపారు. వంటవార్పులు, రహదారి దిగ్బంధాలు, మానవహారాలతో సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగింది. ఆయా జిల్లాలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది.

వందరోజుల సమైక్య ఉద్యమానికి చిహ్నంగా వంద మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు, ఉద్యోగులు చిత్తూరు జిల్లా పుంగనూరు వీధుల్లో సమైక్య నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు, విద్యార్థులు తెలుగుతల్లి విగ్రహాలకు పాలతో అభిషేకం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రహదారుల దిగ్బంధంలో పాల్గొని, వంటా వార్పు నిర్వహించింది. ఉద్యోగ ఐకాస ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తి విద్యార్థులు, టీచర్లు ముక్కంటి ఆలయ మాడ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.

కుప్పంలో తెలుగుదేశం కార్యకర్తలు ఉప్పు పాకెట్లతో వినూత్న నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎపిఎన్జీవోఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రాస్తా రోకో నిర్వహించింది. శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో భారీ మానవహారం నిర్వహించారు. సమైక్యాంధ్రను ఆకాంక్షిస్తూ చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన శిల్పి మంచాల సనత్‌కుమార్ ఓ సైకత శిల్పాన్ని రూపొందించారు. నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం, విజయనగరం తదితర జిల్లాల్లోని ఆందోళనలు నిర్వహించారు.

100 రోజులు 1

100 రోజులు 1

సమైక్యాంధ్ర ఉద్యమం వంద రోజులకు చేరుకున్న సందర్భంగా విశాఖపట్నంలో లాయర్ల ఐక్యకార్యాచరణ సమితి దీక్ష చేస్తున్న దృశ్యం.

100 రోజులు 2

100 రోజులు 2

విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో సీమాంధ్ర ప్రాంత న్యాయవాదులు గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆందోళన చేస్తున్న దృశ్యం.

100 రోజులు 3

100 రోజులు 3

సమైక్యాంధ్ర ఉద్యమం వంద రోజులకు చేరుకున్న సందర్భంగా విశాఖపట్నంలో లాయర్లు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న దృశ్యం.

100 రోజులు 4

100 రోజులు 4

సమైక్యాంధ్ర రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ విగ్రహం ఎదుట గురువారం దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ..

100 రోజులు 5

100 రోజులు 5

సమైక్యాంధ్ర రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ విగ్రహం ఎదుట గురువారం దిగ్విజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు సిద్ధంగా ఉంచిన వైనం.

100 రోజులు 6

100 రోజులు 6

తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది... జై సమైక్యాంధ్ర అంటూ తెలంగాణ రాజకీయ ఐక్యాకార్యాచరణ సమితి ఏర్పాటు చేసిన సమావేశం.

100 రోజులు 7

100 రోజులు 7

సమైక్యాంధ్ర ఉద్యమం వంద రోజులకు చేరుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో సమైక్యవాదులు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం.

100 రోజులు 8

100 రోజులు 8

సమైక్యాంధ్ర ఉద్యమం వంద రోజులకు చేరుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో సమైక్యవాదులు వంద రూపంలో కూర్చున్న దృశ్యం.

శివ ప్రసాద్ 1

శివ ప్రసాద్ 1

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపి శివ ప్రసాద్ యముడి వేషధారణలో వినూత్న నిరసన తెలిపారు. సావిత్రి, చిత్రగుప్తుడి వేషధారణలో మరో ఇద్దరు వేసి అలరించారు.

శివ ప్రసాద్ 2

శివ ప్రసాద్ 2

యమధర్మరాజు వేషంలో ఉన్న ఎంపి శివ ప్రసాద్‌ను సావిత్రి వేషధారణిలో ఉన్న వారు ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని వేడుకుంటూ నిరసన తెలిపారు.

శివ ప్రసాద్ 3

శివ ప్రసాద్ 3

దీనికి యముడు నిరాకరించి.. అది తప్ప వేరే ఏదైనా వరం కోరుకోమంటాడు. పట్టువదలని సావిత్రి సమైక్యమే కావాలంటుంది. చివరకు యముడు విభజనలో అన్యాయాన్ని అర్థం చేసుకుంటాడు.

శివ ప్రసాద్ 4

శివ ప్రసాద్ 4

తాను కూడా సమైక్య ఉద్యమంలో భాగస్వామి అవుతాడు. సమైక్య ఉద్యమంలో భాగంగా తిరుపతిలో సమైక్య సావిత్రి పేరుతో ప్రత్యేక ప్రదర్శన చేశారు. యమ ధర్మరాజు వేషంలో ఎపి శివ ప్రసాద్ సందడి చేశారు.

శివ ప్రసాద్ 5

శివ ప్రసాద్ 5

ఎంపీ శివ ప్రసాద్ యముడగా, మరో ఇద్దరుసావిత్రి, చిత్రగుప్తుడి వేషధారణలో చిత్తూరు జిల్లా తిరుపతిలో గురువారం సమైక్య ఆందోళన వంద రోజులు చేసుకున్న సమయంలో ఈ ప్రదర్శన చేశారు.

శివ ప్రసాద్ 6

శివ ప్రసాద్ 6

జానపద నాటక రూపంలో ప్రజలకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని శివ ప్రసాద్ వివరించారు. సమైక్య ఉద్యమం గురువారంకు వంద రోజులుకు చేరుకున్న నేపథ్యంలో ఆయన మరోసారి తనదైన శైలిలో సమైక్యాంధ్ర వాణిని వినిపించారు.

English summary
Activists of YSR Congress held road blockade at different places on the NH-16, to protest against bifurcation of the State, on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X