వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌పోర్టు టు లేక్ వ్యూ: డిగ్గీకి సమైక్య సెగ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ పర్యటన గురువారం ఉద్రిక్తతకు దారి తీసింది. విమానాశ్రయంలో దిగినప్పటి నుండి లేక్ వ్యూ అతిథి గృహం వరకు ఆయనను సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.

డిగ్గీ ఉదయం విమానాశ్రయంకు చేరుకోగానే సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఆయన రాకను నిరసిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నేతలు ఆందోళనకు దిగారు. డిగ్గీ వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో తెలంగాణవాదులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సమైక్యవాదులను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం లేక్ వ్యూ అతిథి గృహం వద్ద సీమాంధ్ర విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తంగా మారింది. దిగ్విజయ్ గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. లోపలకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్డు పైన బైఠాయించారు.

డిగ్గీ అండ్ కిరణ్

డిగ్గీ అండ్ కిరణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌‌ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేక్ వ్యూ అతిథి గృహంలో కలుసుకున్నారు. విభజనపై ఇద్దరి మధ్య అరగంటకు పైగా చర్చ సాగింది.

డిగ్గీ 1

డిగ్గీ 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ రాకను నిరసిస్తూ తాము ఆందోళనలు చేపడతామని ఎపిఎన్జీవోలు చెప్పడంతో పోలీసు బందోబస్తు.

డిగ్గీ 2

డిగ్గీ 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ రాకను నిరసిస్తూ తాము ఆందోళనలు చేపడతామని ఎపిఎన్జీవోలు చెప్పడంతో పోలీసు బందోబస్తు.

డిగ్గీ 3

డిగ్గీ 3

దిగ్విజయ్ సింగ్‌ రాకను నిరసిస్తూ తాము ఆందోళనలు చేపడతామని ఎపిఎన్జీవోలు చెప్పడంతో పోలీసు బందోబస్తు. లేక్ వ్యూ వద్ద మోహరించిన పోలీసులు.

డిగ్గీ 4

డిగ్గీ 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ రాకను నిరసిస్తూ లేక్ వ్యూ అతిథి గృహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.

డిగ్గీ 5

డిగ్గీ 5

రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ రాకను నిరసిస్తూ లేక్ వ్యూ అతిథి గృహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. జై సమైక్యాంధ్ర, డిగ్గీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

బొత్స 1

బొత్స 1

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కమిటీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ కలిసి పరామర్శించారు.

బొత్స 2

బొత్స 2

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణను ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పరామర్శించి, ఆరోగ్యం విషయమై అడిగారు.

English summary
The Seemandhra students and Samaikyandhra activists protested at lake view guest house on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X