హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓయులో టెన్షన్, క్రాస్ రోడ్డులో నిలిపేశారు! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిని నిరసనలు ఉధృతం అయ్యాయి.

ఉస్మానియా విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది.

ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించవద్దని విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుండి తార్నాక వైపుకు ప్రదర్శనంగా వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిని నిరసనలు ఉధృతం అయ్యాయి.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం


ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించవద్దని విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుండి తార్నాక వైపుకు ప్రదర్శనంగా వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

అయితే, వారు ఓయు పోలీస్ స్టేషన్ వైపు కాకుండా ఓల్డ్ పీజీ హాస్టల్ ప్రాంతం మీదుగా వెళ్తుండగా అప్రమత్తమైన పోలీసులు బ్యారీకేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

దీంతో విద్యార్థులు బ్యారీకేడ్లను తోసుకుంటూ వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం


విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ సంఘటనలో సురేందర్ అనే విద్యార్థి తలకు గాయమైంది. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

నిరసన తెలుపుతున్న విద్యార్థి నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి అంబర్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

కొందరు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు క్యాంపస్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వచ్చారు. అక్కడ తమ నిరసనను తెలిపారు.

ర్టీసీ క్రాస్ రోడ్స్

ర్టీసీ క్రాస్ రోడ్స్

ఎంసెట్ కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థులు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నిరసన తెలిపారు.

 ఆర్టీసీ క్రాస్ రోడ్స్

ఆర్టీసీ క్రాస్ రోడ్స్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌన్సెలింగ్ ఆలస్యం చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థులు ఆరోపించారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్

ఆర్టీసీ క్రాస్ రోడ్స్

తెలంగాణ ప్రభుత్వం వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మానవహారం నిర్వహించిన దృశ్యం.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్

ఆర్టీసీ క్రాస్ రోడ్స్

తెలంగాణ ప్రభుత్వం వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మానవహారం నిర్వహించారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్

ఆర్టీసీ క్రాస్ రోడ్స్

ఎంసెట్ కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థులు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నిరసన తెలిపారు.

 ఆర్టీసీ క్రాస్ రోడ్స్

ఆర్టీసీ క్రాస్ రోడ్స్

ఎంసెట్ కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థులు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

English summary

 Tense situation prevailed at the OU as students continued their protest against the regularisation of the contract employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X