వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి మహిళని లాక్కెళ్తూ, దీవించాలని బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అత్యాచారం జరిపిన వారిని అక్కడే అప్పటికప్పుడే కాల్చేయాలని లేదా ఉరిశిక్ష విధించాలని తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యేలు ఉమా మాధవ రెడ్డి, సీతక్క డిమాండ్ చేశారు. వారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ, అత్యాచారాలకు అంతు లేకుండాపోతోందని అన్నారు. ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించలేకపోతోందన్నారు. మహిళలపై దారుణాలకు నిరసనగా తెలుగు మహిళలు ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు, మహిళలపై టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వరాలు కురిపించారు. అన్నగా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారి కష్టాలు తీరుస్తానని, భవిష్యత్తుకు భద్రత కల్పిస్తానని భరోసా కల్పించారు. ప్రస్తుతం ఉన్న బంగారు తల్లి పథకం అంత బాగా లేదని, టిడిపి అధికారంలోకి వస్తే, మహిళల కోసం 'మహాలక్ష్మి' అనే పథకాన్ని అమలు చేస్తామన్నారు.

పెళ్లి వయసు నాటికి రూ.2 లక్షలు అందజేస్తామని, కెజి నుంచి పిజి వరకూ ఉచిత విద్యను అందజేస్తామని, ప్రభుత్వ పథకాలు, ఆస్తులన్నీ మహిళల పేరిటనే అందజేస్తామన్నారు. 'మా అన్న మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నాడు అని మీరు అనుకునేలా పనిచేస్తా. దీవించండి'' అని మహిళలను చంద్రబాబు కోరారు. బాబు నిజామాబాద్, కృష్ణా, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చిన మహిళా సంఘాల ప్రతినిధులతో సోమవారం సాయంత్రం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో సమావేశమయ్యారు.

తెలుగు మహిళ 1

తెలుగు మహిళ 1

మహిళలపై పెరిగిన అత్యాచారాలకు నిరసనగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో సోమవారం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

తెలుగు మహిళ 2

తెలుగు మహిళ 2

మహిళలపై పెరిగిన అత్యాచారాలకు నిరసనగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో సోమవారం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యే.

తెలుగు మహిళ 3

తెలుగు మహిళ 3

మహిళలపై పెరిగిన అత్యాచారాలకు నిరసనగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో సోమవారం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాట్లాడుతున్న తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి.

తెలుగు మహిళ 4

తెలుగు మహిళ 4

మహిళలపై పెరిగిన అత్యాచారాలకు నిరసనగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో సోమవారం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

తెలుగు మహిళ 5

తెలుగు మహిళ 5

మహిళలపై పెరిగిన అత్యాచారాలకు నిరసనగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో సోమవారం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యం.

తెలుగు మహిళ 6

తెలుగు మహిళ 6

మహిళలపై పెరిగిన అత్యాచారాలకు నిరసనగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో సోమవారం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యం.

తెలుగు మహిళ 7

తెలుగు మహిళ 7

మహిళలపై పెరిగిన అత్యాచారాలకు నిరసనగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో సోమవారం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అరెస్టు చేసి డిసిఎం ఎక్కించిన దృశ్యం.

చంద్రబాబు 1

చంద్రబాబు 1

చంద్రబాబు నిజామాబాద్, కృష్ణా, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చిన మహిళా సంఘాల ప్రతినిధులతో సోమవారం సాయంత్రం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో సమావేశమయ్యారు.

చంద్రబాబు 2

చంద్రబాబు 2

మహిళలపై టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వరాలు కురిపించారు. అన్నగా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారి కష్టాలు తీరుస్తానని, భవిష్యత్తుకు భద్రత కల్పిస్తానని భరోసా కల్పించారు.

English summary

 Telugu Mahila protest and Challo Assembly against attrocities on Women and arrested by police on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X