చెల్లితో వెళ్తుంటే ముద్దుపెట్టి, తర్వాత కూడా: టెక్కీఇతనే!
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆదివారం ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు అతనిని చితకబాది పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన కూకట్‌పల్లిలోని హెచ్ఎంటి కాలనీ సమీపంలో జరిగింది. షేరింగ్ ఆటోలో వెళ్తుండగా సదరు టెక్కీ యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వారు అతనిని చితకబాది, అనంతరం పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లారు. కూకట్ పల్లి నుండి హైటెక్ సిటీకి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కెపిహెచ్‌బి నివాసి అయిన శ్రీనివాస రాజు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆదివారం మధ్యాహ్నం ఆల్విన్‌కాలనీ షిరిడీ హిల్స్ సమీపంలో ఓ యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ యువతి తన చెల్లెలితో కలిసి ఆటోలో వెళ్తుండగా 26 ఆరేళ్ల శ్రీనివాస్ బైక్ పైన వెంబడించాడు.

కూకట్‌పల్లిలోని హుడా పార్కు వద్ద ఆటో నెమ్మదించడంతో శ్రీనివాస్ ఆటోలోని ఓ యువతిని ముద్దు పెట్టి అక్కడి నుండి పరారయ్యాడు. అనంతరం ఆ యువతి తన చెల్లెలితో కలిసి హెచ్ఎంటి హిల్స్‌లో ఆటో దిగుతున్న సమయంలో కూడా శ్రీనివాస్ అక్కడకు చేరుకొని యువతితో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు.
ఆ యువతి కేకలు వేయడంతో స్థానికులు శ్రీనివాసును పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ నిజాంపేటలో నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications