'శివ' హెచ్చరిక: మీడియా ముందు ఎల్లంగౌడ్(పిక్చర్స్)
హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం హైదరాబాదు షామీర్‌పేట వద్ద నకిలీ కరెన్సీ ముఠా పోలీసులపై కాల్పులు జరిపి ఓ కానిస్టేబుల్‌ను పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన ముఠా నాయకుడు ఎల్లంగౌడ్‌ను పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
ఈ ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడిని మంగళవారం పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు.
ఎల్లంగౌడ్ పైన తెలంగాణలో 15, కర్ణాటకలో 3 కేసులు ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ప్రాణాలకు తెగించి ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎస్సై వెంకట రెడ్డిని ఈ సందర్భంగా సత్కరించారు.

ఎల్లంగౌడ్
కొద్ది రోజుల క్రితం హైదరాబాదు షామీర్‌పేట వద్ద నకిలీ కరెన్సీ ముఠా పోలీసులపై కాల్పులు జరిపి ఓ కానిస్టేబుల్‌ను పొట్టనబెట్టుకోవడం తెలిసిందే.

ఎల్లంగౌడ్
ఈ ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడిని మంగళవారం పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు.

ఎల్లంగౌడ్
ఎల్లంగౌడ్ పైన తెలంగాణలో 15, కర్ణాటకలో 3 కేసులు ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ప్రాణాలకు తెగించి ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎస్సై వెంకట రెడ్డిని ఈ సందర్భంగా సత్కరించారు.

ఎల్లంగౌడ్
ఈ నెల 14వ తేదీన శంషాబాద్ ఎన్‌కౌంటర్‌లో చైన్ స్నాచర్ శివ మృతి చెందాడు. దీంతో నగర కమిషనర్ ఎల్లగౌడ్‌కు హెచ్చరికలు జారీ చేశారు.

ఎల్లంగౌడ్
దీంతో కర్నాటకకు పారిపోయిన ఎల్లగౌడ్ మెదక్ జిల్లాకు చెందిన ఓ న్యాయవాది, ఓ రాజకీయ నాయకుడితో కలిసి సైబరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఎల్లంగౌడ్
నకిలీ నోట్ల తయారీ ముఠాలోని మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన ముస్తఫా, శ్రీకాంత్, ఎల్లగౌడ్‌ను పట్టుకునేందుకు అదే ముఠాకు చెందిన రఘు, నరేష్‌లతో బాలాజీనగర్ జోన్ టాస్క్ ఫోర్స్ వెంకట రెడ్డి తన సిబ్బందితో కలిసి ఈ నెల 1న మజీద్ పుర చౌరస్త వద్ద డెకాయి ఆపరేషన్ నిర్వహించారు.

ఎల్లంగౌడ్
ఈ సందర్భంగా ఎల్లగౌడ్ చేతిలో కానిస్టేబుల్ ఈశ్వర రావు కత్తిపోట్లకు గురై మృతి చెందారు. ఎస్సై వెంకట్ రెడ్డి పైన కత్తితో దాడి చేసిన మస్తాన్ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు.

ఎల్లంగౌడ్
అప్పటి నుండి పరారీలో ఉన్న ముఠా నాయకుడు ఎల్లగౌడ్‌ను పట్టుకునేందుకు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ఎల్లంగౌడ్
దీంతో ఎల్లగౌడ్ కర్నాటకకు పారిపోయాడు. అనంతరం శివ పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ అయ్యాడు. కమిషనర్ ఎల్లగౌడ్‌ను హెచ్చరించాడు. అతను వచ్చి లొంగిపోయాడు.

ఎల్లంగౌడ్
ఎల్లంగౌడ్‌ను అరెస్టు చేసి అతని వద్ద ఉన్న తుపాకీ, రూ.69వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు సోమవారం మీడియా ఎదుట తెలిపారు.

ఎల్లంగౌడ్
ఎల్లంగౌడ్ ముఠా ఆయుధాలను బీహార్ నుండి తీసుకొచ్చారని సైబరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం తెలిపారు.

ఎల్లంగౌడ్
కాగా, హైదరాబాద్ పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుండి ఎస్సై వెంకట్ రెడ్డికి రూ.5 లక్షలు, చనిపోయిన కానిస్టేబుల్ ఈశ్వర రావు కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఎల్లంగౌడ్
ఎస్సై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ నోట్ల ముఠాను పట్టుకునేందుకు మారువేషంలో వెళ్లామని, దొంగల్ని నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని, తాము పోలీసులమని తెలుసుకొని దొంగలు దాడి చేశారన్నారు.












Click it and Unblock the Notifications