విశాఖ విషాదం: హత్యా, ప్రమాదమా? (పిక్చర్స్)
విశాఖపట్నం: విశాఖపట్నంలో చోటు చేసుకున్న సంఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖలోని సాలిగ్రామపురంలోని పోర్టు క్వార్టర్స్‌లో నివసిస్తున్న మొహిద్దీన్ భార్య, అతని ఇద్దరు పిల్లలు ఇంట్లోనే సజీవ దహనమయ్యారు. పోర్టు క్వార్టర్స్‌లోని 977 క్వార్టర్‌లో మొహిద్దీన్ పోర్టులో పనిచేస్తున్నాడు.
క్వార్టర్స్‌లో ఉంటున్నవారు హుటాహుటిన చేరుకుని చూడగా, ఇంటి బయట తాళం వేసి ఉంది. అప్పటికే ఇంటిని మంటలు చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పిచూడగా, ఇంట్లో సగ భాగం కాలిపోయింది.
చనిపోయింది తన భార్య సుల్తానా బేగం(40), కుమార్తె సోఫియా బేగం(17), కుమారుడు మహ్మద్ షపీ(11) అని మాత్రం చెబుతున్నాడు. తన భార్య, పిల్లలు ఏవిధంగా చనిపోయారో చెప్పాలని మొహిద్దీన్ మీడియాను ప్రశ్నించడం గమనార్హం. ఇంట్లో గ్యాస్ సిలెండర్ లీక్ అయి చనిపోయారని ముందు భావించారు. అయితే గ్యాస్ సిలెండర్లు చెక్కు చెదరలేదు.

విశాఖలో అగ్నిప్రమాదం
విశాఖలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు ఇంట్లో అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ సంఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గ్యాస్ సిలిండర్లు చెక్కు చేదరలేదు..
గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని భావించారు. అయితే, సిలిండర్లు చెక్కు చెదరలేదు.

నిమిషాల్లో మంటలు..
నిమిషాల్లో ఇంట్లో అంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడానికి ఎలా సాధ్యమైందో పోలీసులకు అంతుపట్టడం లేదు.

చడీచప్పుడు లేకుండా..
ఇల్లంతా మంటలు వ్యాపించినప్పుడు ఇంట్లో ఉన్న ముగ్గురిలో ఒక్కరు కూడా బయటకు వచ్చి కేకలు వేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అనుమానాలు చాలా..
మంటలు వ్యాపించడానికి ముందే ఈ ముగ్గురు చనిపోయారా? లేక బంధింపబడి ఉన్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

షార్ట్ సర్క్యూట్ కాదు..
షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందనడానికి ఆ పరిస్థితులు కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. దాంతో సంఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాళం వేసి ఉంది..
ఇంటి వెనుక తలుపులకు కూడా తాళాలు వేసి ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే వచ్చిన ఇంటి పెద్ద ప్రమాదం ఎలా జరిగిందంటూ మీడియాను అడగడం ఆశ్చర్యం గొలిపింది.

మంచం మీద శవాలు
మంచంమీద, నేల పైన కాలి బూడిదైన రెండు శవాలు పడి ఉన్నాయి. సంఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికులు పోర్టు కార్యాలయానికి ఫోన్ చేసి మొహిద్దీన్‌ను రప్పించారు.

అతను వెళ్లిన కొద్దిసేపటికే..
బుధవారం ఉదయం 8.45 గంటలకు మొహిద్దీన్ యథావిధిగా విధులకు బయల్దేరి వెళ్లాడు. అతడు వెళ్లిన కొద్ది సేపటికే ఇంటి నుంచి మంటలు వ్యాపించాయి.

ముగ్గురు చనిపోయారు..
ఇంటికి నిప్పు అంటుకుని మంటలు లేచి ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసుల అనుమానాలు..
సంఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంటలు ఎలా లేచాయనే విషయం అంతు చిక్కడం లేదు.

ఏం జరిగిందో...
ఏం జరిగిందో ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ముగ్గురు మాత్రం మంటల్లో కాలిపోయారు. అనుమానులు ముసురుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications