Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అదితికి కడపటి వీడ్కోలు: కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు (పిక్చర్స్)

విశాఖపట్నం: విశాఖపట్నంలోని డ్రైనేజీలో కొట్టుకుపోయిన మరణించిన చిన్నారి అదితికి శుక్రవారం విశాఖ నగరం కన్నీటి వీడ్కోలు పలికింది. గత నెల 24న నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు భారీగా చేరడం, అదే సమయంలో అదితి ట్యూషన్ నుంచి బయటకు వచ్చి, కారు ఎక్కుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే

అదితి జాడ కోసం వారం రోజులపాటు గాలించారు. చివరికి గురువారం సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో అదితి శవమై విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బపాలెం సముద్ర తీరంలో కనిపించింది. శుక్రవారం ఉదయం అదితి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి, తరువాత బంధువులకు అప్పగించారు.

సీతమ్మధారలోని అదితి తాత వెంకటేశ్వరరావు ఇంటికి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. అప్పటికే అదితి ఇంటి వద్దకు బంధువులు, నగర ప్రజలు భారీగా చేరుకున్నారు. అదితి మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. ఇదే సమయంలో అదితి తండ్రి శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేసి ఓదార్చారు. జరిగిన దుర్ఘటన పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అదితి మృతదేహానికి అంత్యక్రియలు

అదితి మృతదేహానికి అంత్యక్రియలు

అదితి మృతదేహానికి మధ్యాహ్నం విశాఖపట్నంలోని మద్దిలపాలెం శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

కంటతడి పెట్టిన ప్రజలు

కంటతడి పెట్టిన ప్రజలు

టీవీ చానెళ్లలో అదితి అంతిమయాత్ర దృశ్యాలను చూసి నగర ప్రజలు చలించిపోయి కంటతడిపెట్టారు.
పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికఅదితి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన తరువాత డాక్టర్లు ప్రాథమిక నివేదికను విడుదల చేశారు.

నివేదిక ఇలా..

నివేదిక ఇలా..

అదితి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయి ఉంటుందని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. కాగా, అదితి జాడ వారం రోజులైనా తెలియకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పూర్తి స్థాయి నివేదిక అందాల్సే ఉంది..

పూర్తి స్థాయి నివేదిక అందాల్సే ఉంది..

అదితి పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక వచ్చినప్పటికీ, పూర్తిస్థాయి నివేదిక అందాల్సి ఉంది. అప్పటి వరకూ కేసు మూసి వేయలేమని పోలీస్ అధికారులు చెపుతున్నారు.

కన్రెప్ప పాటులో...

కన్రెప్ప పాటులో...

గత నెల 24వ తేదీన కురిసిన వర్షానికి డ్రైనేజీ ఉప్పొంగుతుందని, తాను అందులో పడిపోతానని అదితి ఊహించి ఉండదు.

అన్వేషణ...

అన్వేషణ...

డ్రైనేజీలో మాయమైన అదితి ఏమైందోనని విశాఖపట్నం ప్రజలు ఆందోళన చెందారు. వారు రోజుల పాటు వారి ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది.

క్షేమంగా బయటకు రావాలని...

క్షేమంగా బయటకు రావాలని...

అదితి క్షేమంగా బయటకు రావాలని విశాఖపట్నం ప్రజలు కోరుకున్నారు. ఆమె ఆనవాళ్లు లభించకపోవడంతో బతికే ఉందనే అనుమానాలను కూడా వ్యక్తం చేశారు.

కదిలిన యంత్రాంగం...

కదిలిన యంత్రాంగం...

అదితి కోసం ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. పది పడవలను రంగంలోకి దించడంతో పాటు మత్స్యకారులను, నావికాదళ సభ్యులను, కమ్యూనిటీ గార్డులను, వందలాది పారిశుధ్య కార్మికులను గాలింపులో వినియోగించారు.

కోటిన్నర ఖర్చు..

కోటిన్నర ఖర్చు..

స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా అదితి గాలింపులో తమ వంతు పాత్ర నిర్వహించాయి. కోటి రూపాయలు ఖర్చు చేశామని ప్రభుత్వ వర్గాలు చెబుతుననాయి.

విజయనగరం జిల్లాలో...

విజయనగరం జిల్లాలో...

విజయనగరం జిల్లాలోని ఓ మారుమూల తీర ప్రాంతంలో ఏడు రోజుల తర్వాత అదితి విగతజీవిగా కనిపించింది.

కన్నీరు మున్నీరు..

కన్నీరు మున్నీరు..

అదితి మృతికి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అదితి బతికే ఉంటుందనే మిణుకుమిణుకుమంటున్న ఆశ కూడా అడగంటిపోవడంతో వారు గుండెలు అవిసేలా విలపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+