సంక్రాంతి: పతంగితో అసెంబ్లీకి అక్బరుద్దీన్ (ఫొటోలు)

హైదరాబాద్‌‌: పతంగుల పండుగ త్వరలో సందడి చేయబోతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగరేసి, ఆనందాన్ని ఆస్వాదించడం ఆనవాయితీ. సంక్రాంతి పండుగ సందర్భంగా రంగు రంగుల పతంగులు ఆకాశంలో పక్షుల్లా ఎగురుతుంటాయి. ఆ వాతావరణాన్ని మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభకు కూడా తెచ్చి పెట్టారు.

విభజన రాజకీయాలతో రాష్ట్ర శాసనసభ నిత్యం వేడెక్కుతున్న సమయంలో అక్బరుద్దీన్ తన పతంగి ద్వారా ఆహ్వాద వాతావరణాన్ని కల్పించారు. శాసనసభ ఆవరణలో ఆయన పతంగిని ఎగరేయడానికి కూడా ప్రయత్నించారు.

సంక్రాంతి హిందువుల పండుగ అయినప్పటికీ అక్బరుద్దీన్ పతంగిని ఎగరేయడం ద్వారా తన మత సామరస్య భావనను ప్రకటించుకున్నారు. ఆయన పతంగితో చాలా ఆహ్లాదంగా కనిపించారు.

పతంగితో అక్బరుద్దీన్ 1

పతంగితో అక్బరుద్దీన్ 1

మజ్లీస్ శాసనసభా పక్ష నేత తన వెంట తెచ్చిన పతంగిని శాసనసభ ఆవరణలో ఇలా పట్టుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

పతంగితో అక్బరుద్దీన్ 2

పతంగితో అక్బరుద్దీన్ 2

తన వెంట తెచ్చిన పతంగిని శాసనసభ ఆవరణలో ఎగిరేయడానికి అక్బరుద్దీన్ ప్రయత్నించారు. ఆ పతంగిని ఎగరేయడానికి మరొకరికి ఇచ్చినట్లు కనిపిస్తున్నారు.

పతంగితో అక్బరుద్దీన్ 3

పతంగితో అక్బరుద్దీన్ 3

పతంగిని ఎగరేయడానికి సిద్ధపడుతూ దారపు కండె పట్టుకుని మరొకరికి పతంగిని ఇచ్చారు అక్బరుద్దీన్ ఓవైసి.. వేరే వ్యక్తి దాన్ని పట్టుకుని కాస్తా గాలిలోకి విసిరితే దారం పట్టుకున్న వ్యక్తి దాన్ని పైన దానంతట ఎగరే విధంగా చేస్తాడు. అక్బరుద్దీన్ ప్రయత్నం అదే.

పతంగితో అక్బరుద్దీన్ 4

పతంగితో అక్బరుద్దీన్ 4

ప్రభుత్వ చీఫ్ విప్, కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డితో కులాసాగా కబుర్లు చెబుతూ అక్బరుద్దీన్ ఓవైసీ ఇలా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+