అంజన్: నామినేషన్ వేశారు, డ్యాన్స్ చేశారు (పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గం అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో సికింద్రాబాద్ నుంచి బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయపై పోటీ చేసి విజయం సాధించారు.
దత్తాత్రేయపై ఎవరూ పోటీ చేయడానికి ఇష్టపడని స్థితిలో అప్పట్లో అంజన్ కుమార్ యాదవ్‌ను కాంగ్రెసు నాయకత్వం పోటీకి దించింది. దాంతో ఆయన జాక్‌పాట్ కొట్టారు. మళ్లీ ఆయనకే కాంగ్రెసు టికెట్ లభించింది. దాంతో ఆయన కాంగ్రెసులో ముఖ్యమైన నేతగా ఎదిగారు.
సికింద్రాబాద్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు అధిష్టానం ఆయననే పోటీకి దించింది. ఆ హుషారులో అంజన్ కుమార్ యాదవ్ నామినేషన్ వేసి, లంబాడీలతో కలిసి నృత్యం చేశారు.

అంజన్ కుమార్ హుషారు..
సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గం టికెట్‌ను మరోసారి దక్కించుకున్న కాంగ్రెసు నేత అంజన్ కుమార్ యాదవ్ బుధవారం హుషారుగా కనిపించారు.

గద ఎత్తారు..
సికింద్రాబాద్ లోకసభ స్థానానికి నామినేషన్ వేసిన సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ గద ఎత్తారు. పోటీకి సిద్ధపడ్డారు.

నృత్యం చేశారు..
సికింద్రాబాద్ లోకసభ స్థానానికి నామినేషన్ వేసిన సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ లంబాడా స్త్రీలతో కలిసి నృత్యం చేశారు.

ఇలా విజయ సంకేతం..
సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గానికి నామినేషన్ వేసిన సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ ఇలా విజయ సంకేతంతో ఊరేగింపు..

అంజన్ కుమార్ ఇలా..
సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గానికి నామినేషన్ వేసిన సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ ఇలా కనిపించారు.












Click it and Unblock the Notifications