భూమా కుమారుడికి తప్పిన ప్రమాదం (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమానాగిరెడ్డి కుమారుడు విఖ్యాత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. భూమా కుమారుడు స్నేహితులతో కలిసి కారులో హైదరాబాదులోని బంజారాహిల్స్ నుంచి ఉప్పల్ వెళుతున్నారు.
బేగంపేట్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో నుంచి అందరూ దిగిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. సురక్షితంగా బయటపడ్డారు. కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
దగ్ధమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భూమా కుమారుడు విఖ్యాత్ రెడ్డి, స్నేహితులు వేరే కారులో వెళ్లిపోయారు.

భూమా కుమారుడి కారు దగ్ధం
సికింద్రాబాదులోని బేగంపేటలో భూమా కుమారుడి కారులో మంటలు లేచిన దృశ్యం. అకస్మాత్తుగా కారులో మంటలు లేచాయి.

భూమా కుమారుడి కారు దగ్ధం
షార్ట్ సర్క్యూట్ కారణంగానే భూమా నాగిరెడ్డి కుమారుడు ప్రయాణిస్తున్న కారులో మంటలు లేచినట్లు భావిస్తున్నారు.

భూమా కుమారుడి కారు దగ్ధం
భూమా కుమారుడు ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు లేచాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్నవారు దిగిపోయారు.

భూమా కుమారుడి కారు దగ్ధం
కారులో మంటలు లేచిన ప్రమాదం నుంచి భూమా కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. ఆయనతో పాటు మిత్రులు కూడా కారులో ఉన్నారు.

భూమా కుమారుడి కారు దగ్ధం
కారులో లేచిన మంటలను ఆర్పివేశారు. అయితే, భూమా కుమారుడు, అతని మిత్రులు మరో కారులో వెళ్లిపోయారు.

భూమా కుమారుడి కారు దగ్ధం
భూమా నాగిరెడ్డి తనయుడు, అతని మిత్రులు కలిసి ప్రయాణిస్తున్న కారులో అకస్తాత్తుగా మంటలు లేచాయి.












Click it and Unblock the Notifications