వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్స సీరియస్: కిరణ్ నాన్ సీరియస్‌పై గరం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో శనివారం జరిగిన కాంగ్రెసు వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం కొత్త వివాదానికి దారి తీసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవస్థాపక దినోత్సవానికి రాకపోవడంపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు.

పార్టీ వ్యవహారాలపై బొత్స సత్యనారాయణ సీరియస్‌గా దృష్టి సారించినట్లు అర్థమవుతోంది. కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వ్యవహారాలపై నాన్ సీరియస్‌గా మారిపోయినట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.

జనవరి మొదటివారంలో బొత్స సత్యనారాయణ జిల్లా పర్యటనలు చేసే అవకాశాలున్నాయి. ఇతర పార్టీలకు వెళ్లే శాసనసభ్యుల స్థానంలో కొత్తవారిని ఎంపిక చేస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు. అలాగే పనిచేయని జిల్లా అధ్యక్షులను తొలగిస్తామని కూడా ఆయన చెప్పారు. దీన్నిబట్టి పార్టీ వ్యవహారాలపై బొత్స సత్యనారాయణ తీవ్రంగా దృష్టి సారించినట్లు అర్థమవుతోంది.

విహెచ్, దానం ఇలా..

విహెచ్, దానం ఇలా..

కాంగ్రెసు పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు, మంత్రి దానం నాగేందర్ సీరియస్‌గా మాట్లాడుకుంటూ ఇలా... హైదరాబాదుపై ఆంక్షలను అంగీకరించబోమని దానం నాగేందర్ చెప్పారు.

గంగా భవానికి విహెచ్ నమస్తే..

గంగా భవానికి విహెచ్ నమస్తే..

మహిళా కాంగ్రెసు నాయకురాలు గంగా భవానీకి వి హనుమంత రావు నమస్కారం చెబుతూ ఇలా కనిపించారు.

విహెచ్ సందడి..

విహెచ్ సందడి..

కాంగ్రెసు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో వి హనుమంతరావు సందడి చేశారు. కార్యక్రమానికి రాకపోవడంపై ఆయన ముఖ్యమంత్రి మీద విరుచుకుపడ్డారు.

బొత్స సత్యనారాయణ ఇలా..

బొత్స సత్యనారాయణ ఇలా..

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ టోపీతో ఇలా కనిపించారు. ఆయన పార్టీ పతాకను ఆవిష్కరించారు.

పార్టీ పతాకను ఆవిష్కరించిన బొత్స

పార్టీ పతాకను ఆవిష్కరించిన బొత్స

పార్టీ పతాకను అవిష్కరించిన తర్వాత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ - ఎవరి అభిప్రాయాలు వ్యక్తం చేసినా ఉమ్మడి నిర్ణయానికి కట్టుబడి ఉండడమే పార్టీ విధానమని అన్నారు.

పలువురి హాజరు..

పలువురి హాజరు..

పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి మంత్రులు కె. జానారెడ్డి, కాసు వెంకట కృష్ణా రెడ్డి, దానం నాగేందర్ తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు.

జానా రెడ్డి ఇలా..

జానా రెడ్డి ఇలా..

పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కె. జానా రెడ్డి ఇలా కనిపించారు. ఆయనతో పాటు పలువురు నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు.

బొత్స ప్రసంగం..

బొత్స ప్రసంగం..

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ పతాకను ఆవిష్కరించిన తర్వాత ప్రసంగించారు. కాంగ్రెసు పార్టీ ఓటమికి కుంగిపోదని, విజయానికి పొంగిపోదని ఆయన అన్నారు.

పిజెఆర్‌కు నివాళి

పిజెఆర్‌కు నివాళి

పి. జనార్ధన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఇతర నాయకులు శనివారం నివాళులు అర్పించారు.

English summary
PCC president Botsa Satyanarayana is concentrating on Congress affairs and decided act sternly against the rebels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X