సునీత వెల్కం, బాబుతో జెసి బ్రదర్స్ ముచ్చట (పిక్చర్స్)
అనంతపురం: అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం పుట్టపర్తి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి పుట్టపర్తి చేరుకున్న ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి నేరుగా ప్రశాంతి నిలయం చేరుకున్నారు. అక్కడ ట్రస్టు సభ్యులు రత్నాకర్, చక్రవర్తి తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
సత్యసాయి మహాసమాధిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దర్శించుకున్నారు. శాంతిభవన్ అతిథి గృహంలో ట్రస్టు వర్గాలతో ప్రత్యేకంగా చర్చించారు. ట్రస్టు సేవల గురించి ముఖ్యమంత్రి ట్రస్టు సభ్యుల నుంచి తెలుసుకున్నట్లు సమాచారం. సత్యసాయికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారని, ఇలాంటి సేవాసంస్థ దేశంలో ఎక్కడా లేదని బాబు అన్నట్లు సమాచారం.
ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పుట్టపర్తిని తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. రూ. 80 కోట్లతో చేపట్టిన నూతన సత్యసాయి తాగునీటి పథకం దాదాపు పూర్తికావచ్చిందని, ప్రారంభానికి రావాలని ముఖ్యమంత్రిని ట్రస్టు సభ్యులు ఆహ్వానించగా తప్పకుండా వస్తానని బాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది.

పుట్టపర్తిలో చంద్రబాబు
తన రెండు రోజుల అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పుట్టపర్తి వచ్చారు.

పుట్టపర్తిలో చంద్రబాబు
సత్యసాయి మహా సమాధిని చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దర్శించుకున్నారు. సత్యసాయికి నివాళులు అర్పించారు.

పుట్టపర్తిలో చంద్రబాబు
పుట్టపర్తి అభివృద్ధి, సత్యసాయి ట్రస్టుకు ప్రభుత్వ పరంగా అన్నివిధాలు చేయూతనిస్తానని ముఖ్యమంత్రి ట్రస్టు సభ్యులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.

పుట్టపర్తిలో చంద్రబాబు
ట్రస్టు ప్రతినిధులు రత్నాకర్, చక్రవర్తి, కార్యదర్శి ప్రసాదరావు, సభ్యులు మద్రాసు శ్రీనివాస్, భగవత్ విద్య, వైద్య, సామాజిక, మొబైల్ ఆస్పత్రి సేవలను డిజిటల్‌స్క్రీన్‌లో గణాంకాల ద్వారా వివరించినట్లు తెలుస్తోంది.

పుట్టపర్తిలో చంద్రబాబు
పుట్టపర్తిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

పుట్టపర్తిలో చంద్రబాబు
అనంతపురం జిల్లాకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడికి జిల్లా మంత్రి పరిటాల సునీత స్వాగతం చెప్పారు.

పుట్టపర్తిలో చంద్రబాబు
అనంతపురం జిల్లాకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కాల్వ శ్రీనివాసులు స్వాగతం చెప్పారు.

పుట్టపర్తిలో చంద్రబాబు
పుట్టపర్తి వచ్చిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలా తన వద్దకు వచ్చినవారితో చేతులు కలిపారు.

పుట్టపర్తిలో చంద్రబాబు
అనంతపురం జిల్లాకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడితో పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఇలా..

పుట్టపర్తిలో చంద్రబాబు
అనంతపురం జిల్లాకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇలా నిలువెత్తు మాలతో సత్కారం చేశారు.

పుట్టపర్తిలో చంద్రబాబు
అనంతపురం జిల్లాకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడిని జెసి ప్రభాకర్ రెడ్డి కలిసి ఇలా మాట్లాడారు.












Click it and Unblock the Notifications