చంద్రబాబు సహా మంత్రుల ప్రమాణం (పిక్చర్స్)
గుంటూరు: తెలుగుదేసం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుతో పాటు పందొమ్మిది మందితో కూడిన నూతన మంత్రివర్గంతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కృష్ణా జిల్లా కైకలూరు నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. పత్తిపాటి పుల్లారావును కూడా మంత్రి పదవి వరించింది.
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి వైకాపా యువనేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో హోరాహోరీగా జరిగిన ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందిన శిద్ధా రాఘవరావు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజవకర్గంలో మాజీ పీసీసీ చీఫ్ బొత్సపై విజయఢంకా మోగించిన కిమిడి మృణాళిని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత వరుసగా కొల్లు రవీంద్రబాబు, రావెల కిషోర్‌బాబు, పైడికొండల మాణిక్యాలరావు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

చంద్రబాబు ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇలా ప్రమాణ స్వీకారం చేశారు.

తొలుత కెఇ కృష్ణమూర్తి
తొలిగా కర్నూలు జిల్లా నేత కెఇ కృష్ణమూర్తి మంత్రిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

యనమల రామకృష్ణుడు ఇలా..
కెఇ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, శాసన మండలి నాయకుడు యనమల రామకృష్ణుడు ఆంగ్లంలో ప్రమాణస్వీకారం చేశారు.

చిన్నరాజప్ప ఇలా..
పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ప్రమాణ స్వీకారం చేశారు.

అయ్యన్నపాత్రుడు ప్రమాణం
విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు.

బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదోసారి ఎన్నికైన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.

దేవినేని ఉమామహేశ్వర రావు
కృష్ణా జిల్లా మైలవరం నుంచి ఎన్నికైన దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా ప్రమాణం చేశారు.

నారాయణ ప్రమాణ స్వీకారం
ఏ చట్ట సభలోనూ సభ్యుడు కాని నెల్లూరు జిల్లాకు చెందిన నారాయణ విద్యా సంస్థల అధినేత పుంగూరు నారాయణ మంత్రిగా ప్రమాణం చేశారు.

పరిటాల సునీత తడబడ్డారు
అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పరిటాల సునీత ప్రమాణ స్వీకారం చేస్తుండగా మధ్యలో కొద్దిగా తడబడినా సవ్యంగానే ప్రమాణ స్వీకారాన్ని పూర్తిచేశారు.

గంటా శ్రీనివాసరావు ఇలా..
విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గంటా శ్రీనివాసరావు దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

పల్లె రఘునాథ రెడ్డి
అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి ప్రజాప్రతినిధిగా గెలుపొందిన పల్లె రఘునాథ్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి లాగ్‌బుక్‌లో సంతకం చేశారు.

పీతల సుజాత
అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత పీతల సుజాత దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అచ్చెన్నాయుడు ఇలా..
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన కింజరపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications