బాధగా ఉంది: ఏరియల్ సర్వే తర్వాత బాబు (ఫొటోలు)

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం హుధుద్ తుఫాను తాకిడి ప్రాంతాలను సందర్శించారు. ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత ఆయన విశాఖపట్నం చేరుకున్నారు.

కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయన మంత్రులు, అధికారులతో తుపాను నష్టంపై సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో ఏరియల్ సర్వే చేశారు. విశాఖపట్నంలో సమీక్ష నిర్వహించి, అధికారులకు తగిన సూచనలు చేశారు.

ఉత్తరాంధ్రకు వంద సహాయ బృందాలను పంపుతున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర బృందాలతో శాఖలవారీగా అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. కృష్ణా జిల్లాలోని మంచినీటి ట్యాంకర్లను పంపాలని ఆదేశించారు. విశాఖలో నేటి నుంచి మూడు రోజుల పాటు బ్లీచింగ్, క్లోరినేషన్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

చంద్రబాబు ఏరియల్ సర్వే

చంద్రబాబు ఏరియల్ సర్వే

ఆహారం దొరకలేదనే ఫిర్యాదులు రాకుండా అందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంచినీటి కోసం జనరేటర్స్ తెచ్చి పంప్ చేయాలని కోరారు.

చంద్రబాబు ఏరియల్ సర్వే

చంద్రబాబు ఏరియల్ సర్వే

జనరేటర్స్ తెచ్చి పంప్ చేసేలోగా ప్యాకెట్ల ద్వారా మంచినీరు అందించాలని ఆయన సూచించారు. రవాణా సంస్థలు తమ ట్యాంకర్లను సహాయక చర్యలకు వాడాలని ఆయన చెప్పారు.

చంద్రబాబు ఏరియల్ సర్వే

చంద్రబాబు ఏరియల్ సర్వే

నష్టాన్ని చాలా తగ్గించామని చంద్రబాబు చెప్పారు. ఆస్తి నష్టం జరిగిందని, విమానాశ్రయం పోయిందని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు ఏరియల్ సర్వే

చంద్రబాబు ఏరియల్ సర్వే

డైనమిట్ సిటీ అయిన విశాఖను ఈ రోజు చూస్తే బాధ కలుగుతోందని చంద్రబాబు అన్నారు. చాలా బాధగా, ఆవేదనగా ఉందని అన్నారు.

చంద్రబాబు ఏరియల్ సర్వే

చంద్రబాబు ఏరియల్ సర్వే

తాత్కాలికంగా ఏం చేయాలని, దీర్ఘ కాలికంగా ఏం చేయాలనే విషయంపై ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్లు తెలిపారు. పరిశ్రమలు పనిచేసే స్థితిలో లేవని ఆయన అన్నారు.

చంద్రబాబు ఏరియల్ సర్వే

చంద్రబాబు ఏరియల్ సర్వే

కొబ్బరి చెట్లు, ఇతర చెట్లు పూర్తిగా పోయాయని చంద్రబాబు చెప్పారు. పంటలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన అన్నారు. కలెక్టరేట్ ఫోన్ కూడా పోయిందని ఆయన అన్నారు.

చంద్రబాబు ఏరియల్ సర్వే

చంద్రబాబు ఏరియల్ సర్వే

సాధారణం పరిస్థితి నెలకొని, ప్రజలు ఊరట పొందే వరకు తాను విశాఖపట్నంలో ఉంటానని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు ఏరియల్ సర్వే

చంద్రబాబు ఏరియల్ సర్వే

పౌరసరఫరా శాఖ ద్వారా రుకులు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సమీక్ష నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

చంద్రబాబు ఏరియల్ సర్వే

చంద్రబాబు ఏరియల్ సర్వే

చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు అందిస్తామని చంద్రబాబు చెప్పారు. మృతుల కుటుంబాలకు, బాధితులకు అందించే నష్టపరిహారాన్ని, సహాయాన్ని ఆయన ప్రకటించారు.

చంద్రబాబు ఏరియల్ సర్వే

చంద్రబాబు ఏరియల్ సర్వే

తుఫాను సహాయక చర్యల్లో అందరి సహాయం ఆవసరమని చంద్రబాబు అన్నారు. విశాఖ నగరంలోని ఆస్పత్రులకు సాయంత్రంలోగా విద్యుత్తు అందిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+