చెరుకు సుధాకర్ రాజీనామా హల్‌చల్ ఇలా (ఫొటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పోలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద సందడి చోటు టేసుకుంది. రాజీనామా లేఖను పార్టీ కార్యదర్శికి ఇవ్వడానికి ఆయన తెలంగాణ భవన్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
వామపక్ష భావాలతో రాజకీయాల్లో ఉంటూ వస్తున్న చెరుకు సుధాకర్ వృత్తిరీత్యా వైద్యుడు. వామపక్ష భావాలు గల చెరుకు సుధాకర్ తెరాసలో చేరి పోలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. నల్లగొండ జిల్లా నక్రేకల్ శానససభా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అందుకు నిరాకరించినట్లు సమాచారం.
కవి కూడా అయిన చెరుకు సుధాకర్ తెరాసకు రాజీనామా చేసే సమయంలో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని, ఉద్యమకారులకు అవమానం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

మీడియా సమావేశంలో..
తెరాసకు రాజీనామా చేయడానికి ముందు చెరుకు సుధాకర్ తన సతీమణి లక్ష్మితో కలిసి హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాజీనామా లేఖతో...
మీడియా సమావేశంలో తన రాజీనామా లేఖను చూపిస్తూ చెరుకు సుధాకర్ ఇలా కనిపించారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ భవన్ చేరుకున్నారు.

తెలంగాణ తల్లికి నివాళులు..
తన రాజీనామా లేఖను సమర్పించడానికి ముందు చెరుకు సుధాకర్ తన భార్యతో కలిసి తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

రానీయలేదు..
రాజీనామా లేఖతో చేరుకున్న చెరుకు సుధాకర్‌ను తెరాస కార్యకర్తలు తొలుత తెలంగాణ భవన్‌లోకి రానీయలేదు. ఈ సమయంలో ఆ తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.

మీడియాతో చెరుకు సుధాకర్
తాను గొడవ చేయడానికి రాలేదని, రాజీనామా పత్రం సమర్పించి వెళ్లిపోతానని చెప్పడంతో తెరాస కార్యకర్తలు సుధాకర్‌ను తెలంగాణ భవన్‌లోకి అనుమతించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications