జగద్గగిరి గుట్టను ఒక్కసారిగా చుట్టుముట్టి.. (పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాదులోని జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పను ఆదివారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీసులు దిగ్భందించారు. నాలుగు వందల మంది పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. బాలానగర్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, సైబరాబాద్ అడిషనల్ డీసీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నాలుగువందల మంది పోలీసులు తెల్లవారుజామున మూడు గంటల నుంచి 6 గంటల వరకు కార్డన్‌సెర్చ్‌లో పాల్గొన్నారు.
రాజీవ్ గృహకల్పలోని 50 బ్లాక్‌లలో ప్రతి ఇంటినీ పూచిక పుల్ల కూడా వదలకుండా తనిఖీ చేశారు. నగరం, ఇతర రాష్ర్టాలలో నేరాలు, దొంగతనాలు చేసి జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఆశ్రయం తీసుకుంటున్నారన్న సమాచారంతో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సెర్చ్‌లో 33 మంది ఎస్‌ఐలు, 13 మంది సీఐలు, ముగ్గురు ఏసీపీలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
కార్డన్ సెర్చ్ సందర్భంగా 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 30 బైక్‌లు, 10 ఆటోలను సీజ్‌చేశారు. అదుపులోకి తీసుకున్న ఓ యువకుడి నుంచి వివిధ కంపెనీలకు చెందిన 100 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం కొందరు పత్రాలను చూపించి వాహనాలు తీసుకు వెళ్లారు.

కార్డాన్ సెర్చ్
ఆదివారం తెల్లవారు జామున పోలీసులు జగద్గిరి గుట్ట రాజీవ్ గృహ కల్పను చుట్టుముట్టి సోదాలు నిర్వహించారు.

కార్డాన్ సెర్చ్
పోలీసులు ఆదివారంనాడు తెల్లవారు జామున సికింద్రాబాదులోని జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పను ఒక్కసారిగా దిగ్బంధం చేశారు .

కార్డాన్ సెర్చ్
ఆదివారంనాడు తెల్లవారు జామున పోలీసులు జగద్గిరిగుట్టలోని రాజీవ్ గృహకల్పలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులను చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
కార్డాన్ సెర్చ్
ఆదివారంనాడు తెల్లవారు జామున పోలీసులు జగద్గిరిగుట్టలోని రాజీవ్ గృహకల్పలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులను చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

కార్జాన్ సెర్చ్
పోలీసులు జగద్గిరిగుట్టలోని రాజీవ్ గృహ కల్పలో కార్డాన్ సెర్చ్ నిర్వహించి 30 బైకులను, 10 ఆచోలను స్వాధీనం చేసుకున్నారు.

కార్జాన్ సెర్చ్
కార్డాన్ సెర్చ్ సందర్భంగా పోలీసులు జగద్దిరిగుట్టలోని రాజీవ్ గృహ కల్పలో సోదాలు నిర్వహించి అన్నింటినీ పరిశీలించారు.

కార్జాన్ సెర్చ్
పోలీసులు జగద్గిరిగుట్టలోని రాజీవ్ గృహ కల్పలో సోదాలు నిర్వహించి పది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

కార్దాన్ సెర్చ్
సికింద్రాబాదులోని జగద్గిరిగుట్ట రాజీవ్ గృహ కల్పలో పోలీసులు సోదాలు నిర్వహించి ఆటోలను, బైకులను స్వాధీనం చేసుకున్నారు.

కార్దాన్ సెర్చ్
పోలీసులు జగద్గిరిగుట్టలోని రాజీవ్ గృహకల్పను చుట్టుముట్టి, దిగ్బంధం చేసి సోదాలు నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications