వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు సైకిల్ పట్టం: సోనియా కోసం ప్రార్థన (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర విభజన తీరును తప్పు పడుతూ నిరాహార దీక్ష చేపట్టిన ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన పచ్చ కామెర్ల వ్యాధికి గురయ్యారు. దాంతో ఆయన హైదరాబాదులోని గాస్ట్రో ఎంటరోలాజికిల్ ఆస్పత్రిలో చేరారు.

పచ్చ కామెర్ల వ్యాధి నయం కావడంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఈ సందర్భంగా ఓ వీరాభిమాని సైకిల్‌కు చంద్రబాబు చిత్రాన్ని కట్టుకుని ఊరేగాడు. సైకిల్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల చిహ్నమనే విషయం తెలిసిందే.

కాగా, చిత్తూరు జిల్లాలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమాధి కట్టడంపై కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దానం నాగేందర్ ఆ సంఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన తప్పు పట్టారు.

బాబు వీరాభిమాని..

బాబు వీరాభిమాని..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అవుతున్న సందర్భంగా ఓ వీరాభిమాని ఇలా సైకిల్‌పై ఆయన బొమ్మతో ప్రదర్శన ఇస్తూ..

డిశ్చార్జీ అయిన తర్వాత..

డిశ్చార్జీ అయిన తర్వాత..

పచ్చకామెర్ల వ్యాధికి చికిత్స చేయించుకున్న తర్వాత పూర్తిగా నయమై చంద్రబాబు నాయుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆ తర్వాత ఇలా బయటకు వస్తూ కనిపించారు.

బయటకు వస్తూ...

బయటకు వస్తూ...

ఆస్పత్రి నుంచి బయటకు వస్తూ చంద్రబాబు నాయుడు ఆస్పత్రి వద్దకు వచ్చినవారికి అభివాదం చేస్తూ ఇలా కనిపించారు.

కారులో బయలుదేరడానికి ముందు..

కారులో బయలుదేరడానికి ముందు..

ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత ఇంటికి కారులో బయలుదేరే ముందు అక్కడికి వచ్చిన వారికి అభివాదం చేస్తున్న చంద్రబాబు నాయుడు

గుమ్మడి కాయ కొడుతూ దానం

గుమ్మడి కాయ కొడుతూ దానం

చిత్తూరు జిల్లాలో సోనియా గాంధీ సమాధి కట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాదుకు చెందిన రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు వద్ద సోనియా పోస్టర్ వద్ద గుమ్మడి కాయ కొడుతూ ఇలా..

సోనియా సమాధి నిర్మాణంపై ఆగ్రహం..

సోనియా సమాధి నిర్మాణంపై ఆగ్రహం..

చిత్తూరు జిల్లాలో సోనియా గాంధీ సమాధి నిర్మించడాన్ని నిరసిస్తూ తన అనుచరులతో దానం నాగేందర్ నిరసన వ్యక్తం చేస్తూ కనిపించారు.

ఇందిరా విగ్రహం వద్ద...

ఇందిరా విగ్రహం వద్ద...

హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో గల ఇందిరా గాంధీ విగ్రహం వద్ద సోనియా పోస్టరుతో మంత్రి దానం నాగేందర్ తన అనుచరులతో ఇలా

English summary
Telugudesam party president Nara Chandrababu Naidu discharged from the hospital in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X