కెసిఆర్ కుటుంబ సభ్యుల నామినేషన్స్ ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కెసిఆర్‌తో పాటు ఆయన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కూతురు కల్వకుంట్ల కవిత, మేనల్లుడు తన్నీరు హరీష్ రావు ఎన్నికల గోదాలోకి దిగారు.
కెటి రామారావు, హరీష్ రావు గత ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసి విజయం సాధించగా, కల్వకుంట్ల కవిత కొత్తగా ఎన్నికల్లోకి దిగారు. కెసిఆర్ గజ్వెల్ శాసనసభ సీటుకు, సిద్ధిపేట పార్లమెంటు సీటుకు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు.
కెటి రామారావు తిరిగి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. తన్నీరు హరీష్ రావు మళ్లీ సిద్ధిపేట శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంటు సభ సీటులో కల్వకుంట్ల కవిత కాంగ్రెసు సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు నేత మధు యాష్కీని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు.

కల్వకుంట్ల కవిత నామినేషన్
నిజామాబాద్ లోకసభ స్థానానికి కెసిఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు.

కెసిఆర్ నామినేషన్
తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గజ్వెల్ శాసనసభా నియోజకవర్గానికి, సిద్ధిపేట పార్లమెంటు స్థానానికి బుధవారంనాడు నామినేషన్లు దాఖలు చేశారు.

సిద్ధిపేటకు హరీష్ రావు
హరీష్ రావు సిద్ధిపేట శాసనసభా స్థానం కోసం బుధవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వరుసగా ఇక్కడి నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు.

కెటి రామారావు నామినేషన్ దాఖలు..
సిరిసిల్ల శాసనసభా నియోజకవర్గానికి కెసిఆర్ తనయుడు కెటి రామారావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన గత ఎన్నికల్లో ఈ సీటు నుంచి విజయం సాధించారు.












Click it and Unblock the Notifications