ముసుగు: హుక్కా సెంటర్లకు తాళాలు (పిక్చర్స్)
హైదరాబాద్: కాఫీ సెంటర్ల ముసుగులో హుక్కా సెంటర్లు నడుపుతున్న రెండు కేంద్రాలను హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఉన్న ఆయిస్టర్ లాంజ్, హేపీ హైదరాబాద్ టైమ్స్ కేఫెలకు అధికారులు తాళాలు వేశారు. వీటికి వాణిజ్య లైసెన్సులు లేవు.
పిల్లలు తరచూ హుక్కా సెంటర్లకు వెళ్తూ ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారని, వీటిపై చర్య తీసుకోవాలంటూ పలువురు తల్లిదండ్రుల నుంచి తమకు ఫిర్యాదులందాయని సెంట్రల్ జోనల్ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. లైసెన్సు లేకుండా హుక్కా సెంటర్లు నడిపిస్తున్న వారిపై దాడులు చేయాలని సర్కిల్-10 ఏఎంఓహెచ్‌కి రోస్ సూచించారు. దీంతో సర్కిల్-10కి చెందిన ఆరోగ్య శాఖాధికారులు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు, ఏఎంఓహెచ్‌లు కలిసి ఆయా కేంద్రాలను తనిఖీ చేశారు.
అక్కడ వంటశాలలతో పాటు ఇతర ప్రాంతాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయని, అక్కడంతా అనారోగ్యకరమైన వాతావరణం ఉందని గుర్తించారు. దాంతో వాటిని సీజ్ చేశారు. ఆ సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, తదుపరి చర్యల కోసం న్యాయస్థానానికి కేసును నివేదిస్తామని వైద్యాధికారి తెలిపారు. అక్కడ వచ్చే తీర్పు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

హుక్కా సెంటర్లపై దాడులు
హైదరాబాదులోని హుక్కా సెంటర్లపై జిహెచ్ఎంసి అధికారులు దాడులు నిర్వహించి, వాటిని సీజ్ చేశారు.

తాళాలు వేశారు...
హైదరాబాదులోని హుక్కా సెంటర్లపై జిహెచ్ఎంసి అధికారులు దాడులు చేసి, వాటికి తాళాలు వేశారు.

కాఫీ సెంటర్ల ముసుగులో...
కాఫీ సెంటర్ల ముసుగులో హుక్కా సెంటర్లను నడుపుతున్నారనే ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు నిర్వహించారు.

పిల్లల ఆరోగ్యాలు పాడు...
హుక్కా సెంటర్లకు వెళ్లడం వల్ల తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు దాడులు చేశారు.

హుక్కాలు ఇలా...
అధికారులు దాడులు నిర్వహించి, హుక్కా సెంటర్లలో ఇటువంటి హుక్కాలను స్వాధీనం చేసుకున్నారు.

షోకాజ్ నోటీసులు..
కాఫీ సెంటర్ల ముసుగులో హుక్కా సెంట్రలను నడుపుతున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని అధికారులు చెప్పారు.

ఇలా తగిలించారు..
హుక్కా సెంటర్లపై అధికారులు దాడులు నిర్వహించి, వాటికి తాళాలు వేసి, ఇలా బోర్డులు కూడా తగిలించారు.












Click it and Unblock the Notifications