హై లైఫ్ ప్రదర్శన: నటి రీతూ వర్మ అదరహో (పిక్చర్స్)

హైదరాబాద్: ఫ్యాషన్‌లను తాను అభిమానించినా సౌకర్యంగా ఉన్న వాటిని మాత్రమే అభిమానిస్తానని అన్నారు నటి రీతు వర్మ. తాను సాధారణంగా జీన్స్‌, టీషర్టులలో సౌకర్యం ఫీలవుతానని ఆమె అన్నారు.
నిర్వాహకులు డొమినిక్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 1 వరకూ ఈ ప్రదర్శన నిర్వహిస్తామని, 150 మందికి పైగా డిజైనర్లు తమ కలెక్షన్‌ ఇక్కడ ప్రదర్శిస్తున్నారని చెప్పారు.

900 సంవత్సరాల చరిత్ర కలిగిన డిజైన్‌, అంతకు మించిన హ్యాండ్‌ వర్క్‌ పటోలా ఆఫ్‌ పటాన్‌ చీరల ప్రత్యేకత. ఈ చీరలు హై లైఫ్‌ ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లక్షన్నర రూపాయలతో ప్రారంభమై 7 లక్షల రూపాయల విలువ కలిగిన ఈ చీరల్లో డబుల్‌ ఇకత్‌ చేనేత శైలి ప్రత్యేక ఆకర్షణ అని ఉజ్వల్‌ న్యుకిన్‌ సాల్వీ చెప్పారు.

గుజరాత్‌లో కొంతమంది చేనేత కళాకారులు మాత్రమే తయారుచేసే ఈ చీరలను అప్పట్లో ఇందిరా గాంధీ నుంచి ఇప్పటి సోనియా గాంధీ వరకూ రాజకీయ నాయకురాళ్లు ధరించారు. ఓ చీర తయారు కావాలంటే కనీసం 20 రకాల ప్రాసెస్‌లు చేయాల్సి ఉండటంతో పాటుగా ఆరేడు నెలల కాలం పట్టటం వల్ల వీటి ధరలు అధికంగా ఉంటాయని అన్నారు.

రీతూ వర్మ సందడి

రీతూ వర్మ సందడి

హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వె న్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన హై లైఫ్‌ ఎగ్జి బిషన్‌ను సినీ రీతు వర్మ ప్రారంభించారు.

రీతూ వర్మ సందడి

రీతూ వర్మ సందడి

హై లైఫ్ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో వ్యాపార వేత్త పార్వతీరెడ్డి, డిజైనర్‌లు రూపవైట్ల, ఇషితా సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

రీతూ వర్మ సందడి

రీతూ వర్మ సందడి

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌లో ఏర్పాటైన హైలైఫ్ ఎగ్జిబిషన్‌లో సినీ నటి రీతూ వర్మ ఇలా ఫోజు ఇచ్చారు.

రీతూ వర్మ సందడి

రీతూ వర్మ సందడి

తాను ఫ్యాషన్‌ను ఇష్టపడినా ధరించడానికి సౌకర్యంగా ఉండే దుస్తులనే ఇష్టపడుతానని సినీ నటి రీతూ వర్మ అన్నారు

రీతూ వర్మ సందడి

రీతూ వర్మ సందడి

అందమైన చీరను ధరించి హైలైఫ్ ఎగ్జిబిషన్‌లో హొయలు ఒలకబోస్తూ ప్రముఖ సినీ నటి రీతూ వర్మ ఇలా..

రీతూ వర్మ సందడి..

రీతూ వర్మ సందడి..

గుజరాత్‌లో కొంత మంది చేనేత కార్మికులు మాత్రమే తయారు చేసే ఈ దుస్తుల్లో మెరిసిపోతూ నటి రీతూ వర్మ..

రీతూ వర్మ సందడి

రీతూ వర్మ సందడి

హైదరాబాదులోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌లో ఏర్పాటైన హైలైఫ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన రీతూ వర్మ ఇలా హొయలు పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+