చిక్కింది: పట్టలేని ఆనందంలో రోజా కన్నీరు (పిక్చర్స్)
తిరుపతి: గతంలో ఓటమి పాలైన సినీ నటి రోజా చివరకు నగరి శాసనసభ స్థానం నుంచి విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆమె విజయం సాధించారు. అయితే, ఆమె ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుంది. తన గెలుపు ఆనందాన్ని ఆమె తట్టుకోలేకపోయారు.
ఒక్కసారిగా ఏడ్చేశారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. విజయం సాధించానని సగర్వంగా చాటుకున్నారు. కాకలు తీరిన తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడిని ఆమె ఓడించారు. టిడిపి అభ్యర్థి, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై ఆమె కేవలం 926 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
తెలుగుదేశం పార్టీలో పనిచేసిన రోజా గతంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం సాధించిన తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెసులోకి రావాలనుకున్నారు. ఆయన మృతి తర్వాత వైయస్ జగన్ పార్టీలో చేరారు.

వికసించిన రోజా
నగరి శాసనసభా స్థానం నుంచి విజయం సాధించిన తర్వాత రోజా తన ఆనందాన్ని తట్టుకోలేకపోయారు. ఆమె ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపించింది.

గెలిచాను, చూడండి..
చివరకు తనను విజయం వరించిందనే ఆనందాన్ని రోజా శుక్రవారం ఇలా వ్యక్తం చేశారు. గెలిచాను అని ఓ మాటన్నారు.

ఎలా వ్యక్తం చేయాలో...
రోజాకు ఆనందాన్ని వ్యక్తం చేయడానికి మాటలు సరిపోలేదు. ఆ ఆనందాన్ని తన శరీర కదలికల ద్వారా ఇలా వ్యక్తం చేశారు.

రోజా ఆనంద భాష్పాలు..
నగరి నుంచి విజయం సాధించిన తర్వాత రోజా ఆనందాన్ని తట్టుకోలేక కంటతడి పెట్టారు. ఎట్టకేలకు తన కోరిక నెరవేరిందనే భావన ఆమెలో వ్యక్తమైంది.

విజయ సంకేతం..
నగరి నుంచి విజయం సాధించిన తర్వాత రోజా ఇలా విజయ సంకేతం చూపారు. ఆమె ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.












Click it and Unblock the Notifications