వానదేవుడి కరుణ: హైదరాబాద్ పులకింత (పిక్చర్స్)
హైదరాబాద్: సూర్యుడు నిప్పులు కురిపిస్తున్న తరుణంలో హైదరాబాదులో బుధవారం అకస్మాత్తుగా వానదేవుడు కరుణించి వర్షం జల్లులు కురిపించాడు ఎండాకాలం పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల ప్రజలకు బుధవారం కురిసిన చిరుజల్లు ఊరట కలిగించింది.
మంగళవారం రాత్రి కూడా చిరుజల్లులు కురవటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సుమారు 42 డిగ్రీలకు పెరిగింది. దానికితోడుకరెంటు కోతలు కూడా అమలవుతున్నాయి. దీంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ స్థితిలోఅకస్మికంగా నగరంలో కురిసిన చిరుజల్లులు కాస్త ఊరటను కల్గిస్తున్నాయి.
నాలుగున్నర గంటల సమయంలో నగరంలో చిరుజల్లులు కురవటం, చల్లటి గాలులు వీయటంతో నిన్నమొన్నటి వరకు సందర్శకుల్లేక వెలవెలబోయిన నగరంలోని పలు పర్యాటక స్థలాల్లో సందర్శకుల సంఖ్య కొంత ఆశాజనకంగానే కన్పించింది.

చిరు జల్లు హాయిలే..
ఎండాకాలం మండిపోతుంటే హైదరాబాదులో బుధవారం సాయంత్రం చిరు జల్లులు పడ్డాయి. దీంతో వాతావరణం చల్లబడి ఏమి హాయిలే అనిపించింది.

రోడ్లపై నీరు
హైదరాబాదు రోడ్లపై బుధవారం సాయంత్రం ఇలా నీరు చేరింది. ఇది ఆనందంగానే ఉంది. ఎర్రటి ఎండలో చల్లటి వాతావరణం కదా..

వర్షం నీరు ఎంత హాయి..
వర్షం జల్లులు పడడంతో వాతావరణం చల్లబడిపోయి ఆహ్లాదకరంగా మారింది. దీంతో చల్లటి నగరంలో ఇలా నడక హాయిగా..

నీటి మడుగులు తప్పలేదు..
చిన్నపాటి వర్షం పడితే కూడా హైదరాబాద్ రోడ్లు నీటి మడుగుల్లా తయారై చిరాకు పుట్టిస్తాయి. కానీ బుధవారంనాటి వర్షం హాయినే ఇచ్చింది.

వర్షం నీటిలో వెతుకులాట..
వర్షంతో హైదరాబాద్ రోడ్లపై నీరు నిండింది. ఆ నీటిలో వారు ఏదో పోగొట్టుకున్నట్లున్నారు. దేవులాడుతున్నారు. వారితో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇలా..

వాహనాలపై ప్రయాణం సరదా...
హైదరాబాదులో బుధవారం సాయంత్రం వర్షం పడడంతో వాతావరణం చల్లబడి వాహనాలపై ప్రయాణం సరదాగానే ఉంది.

రోడ్లపై చల్లదనం..
హైదరాబాదు రోడ్లు వర్షం కారణంగా ఒక్కసారిగా చల్లబడిపోయాయి. ఎండలో మంటలు కక్కే రోడ్లు చల్లగా తాకి ఆహ్లాదాన్ని కలిగించాయి.












Click it and Unblock the Notifications