రైలు ప్రమాదం: కాలి బూడిదయ్యారు (పిక్చర్స్)

అనంతపురం: నాందేడ్ - బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో చాలా మంది గుర్తు పట్టనంతగా కాలి బూడిదయ్యారు. అనంతపురం జిల్లా కొత్తచెరువు వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. వీరిలో 9 మందిని గుర్తించినట్లు రైల్వే మంత్రి మల్లికార్డున్ ఖర్గే చెప్పారు. ఆయన శనివారంనాడు ఘటనా స్థలిని సందర్సించారు. మృతదేహాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

మృతేదేహాలను బెంగళూర్‌లోని విక్టరీ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు రైళ్లలో పేలుడు పదార్థాలు, లిక్కర్ పట్టుకెళ్లకుండా చూస్తామని ఆయన చెప్పారు. ప్రమాదంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు.

మల్లిఖార్జున్ ఖర్డేతో తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మల కిష్టప్ప, పల్లె రఘునాథ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. ప్రమాదంపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లాలో నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి షార్ట్ సర్య్కూటే కారణంగా భావిస్తున్నట్లు డీజీపీ ప్రసాద్‌రావు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ బీ-1 బోగీలో మొత్తం 64 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో 23 మంది చనిపోగా, 14 మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. డీఎన్ఏ పరీక్షల నిమిత్తం హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ బృందాన్ని ఘటనా స్థలికి పంపినట్లు డీజీపీ ప్రసాద్‌రావు తెలియజేశారు.

కాలి బూడిద ఇలా...

కాలి బూడిద ఇలా...

నాందేడ్ - బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీకి మంటలు అంటుకున్నాయి. కాలి బూడిదైన సన్నివేశం ఇలా కనిపించింది.

గుర్తు పట్టరానంతగా..

గుర్తు పట్టరానంతగా..

మృతదేహాలు గుర్తించడానికి వీలు లేకుండా కాలిపోయాయి. వారిని గుర్తించడానికి ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు.

మంటల తీవ్రత...

మంటల తీవ్రత...

షార్ట్ సర్క్యూట్ కారణంగానే రైలు అగ్నిప్రమాదానికి గురైందని డిజిపి ప్రసాదరావు అంటున్నారు. ఈ దృశ్యాన్ని చూస్తే మంటల తీవ్ర అర్థమవుతుంది.

కాలి బూడిదైన శవాలు..

కాలి బూడిదైన శవాలు..

రైలు ప్రమాద ఘటనలో ప్రయాణికులు కాలి బూడిదయ్యారు. అత్యంత విషాదకరమైన దృశ్యం ఇలా కనిపిస్తోంది.

మృతదేహాల తరలింపు..

మృతదేహాల తరలింపు..

ప్రమదా స్థలం నుంచి మృతదేహాలను తరలిస్తున్న సహాయక బృందాలు.. మృతదేహాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలిస్తున్నట్లు రైల్వే మంత్రి ఖర్గే చెప్పారు.

మంటల్లో రైలు బోగీ..

మంటల్లో రైలు బోగీ..

నాందేడ్ - బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ మంటల్లో కాలిపోతున్న దృశ్యం.. మంటలు ఎగిసిపడిన తీరు అత్యంత భయంకరంగా ఉంది.

ప్రమాదానికి గురైన రైలు వద్ద...

ప్రమాదానికి గురైన రైలు వద్ద...

ప్రమాదానికి గురైన రైలు వద్దకు సహాయక బృందాలు చేరుకున్నారు. ప్రమాదం శనివారం తెల్లవారు జామును మూడున్నర గంటల ప్రాంతంలో జరిగింది.

కాలి బూడిదైన బోగీ..

కాలి బూడిదైన బోగీ..

అగ్ని ప్రమాదంలో రైలు బోగీ ఒక్కటి పూర్తిగా దగ్ధమైంది. మరో బోగీ పాక్షికంగా కాలింది. ప్రయాణికులు కొంత మంది కొందరు రైలు నుంచి ఏకంగా దూకేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+