టీవి నటి విజయరాణిపై ఆర్టిస్టుల ఫిర్యాదు (పిక్చర్స్)
హైదరాబాద్: తోటి నటీనటులను మోసం చేసిన టీవి నటి బత్తుల విజయరాణి ఆచూకి కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఆమెపై ఫిర్యాదులు వచ్చి పడుతున్నాయి. ఆమె ఆచూకీ తెలిస్తే సిసిఎస్ పోలీసులకు తెలపాలని డిసిపి జి. పాలరాజు, ఎసిపి విజయ్ కుమార్ ప్రజలను కోరారు.
విజయరాణికి చెందిన శ్రీనగర్ కాలనీలోని ఆమె ఫ్లాట్‌ను పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు తాజాగా ఆరు లక్షల విలువ చేసే ఆమె కారును స్వాధీనం చేసుకున్నారు శ్రీనగర్ కాలనీలోని ఎస్‌బిఐ, ఆంధ్రా బ్యాంక్, ఎస్‌బిహెచ్, కార్పోరేషన్ బ్యాంకుల్లో ఉన్న ఆమె ఖాతాలను సీజ్ చేశారు.
తెలుగు టీవీ నటి విజయరాణి రూ. 7 కోట్ల మోసానికి పాల్పడింది. చిట్టీల పేరుతో విజయరాణి గత కొంతకాలంగా జూనియర్ ఆర్టిస్టుల దగ్గర భారీ మొత్తం డబ్బు వసూలు చేస్తూ వస్తోంది. కొన్నేళ్లుగా నమ్మకంగా చిట్టీలు నిర్వహిస్తుండటంతో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు ఆమె వద్ద డబ్బు పోగేసుకుంటున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా తన వద్ద జమైన రూ. 7 కోట్ల డబ్బుతో విజయరాణి ఉడాయించింది.
మరికొందరు ఈ డబ్బు రూ. 10 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. గత కొన్నిరోజులుగా విజయరాణి ఆచూకీ లేక పోవడంతో తాము మోసపోయామని గ్రహించిన జూనియర్ ఆర్టిస్టులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

టీవి నటి విజయరాణిపై ఆర్టిస్టుల ఫిర్యాదు (పిక్చర్స్)
విజయరాణిపై ఆనంద్ ఫిర్యాదు
చిట్టీల పేరుతో మోసం చేసిన టీవి నటి విజయరాణిపై తోటి నటుడు ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

విజయరాణి బాధితులు
విజయరాణి బాధితులు ఆనంద్, స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయరాణి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

విజయరాణిపై ఎఫ్ఐఆర్..
విజయరాణిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమెకు చెందిన ఆస్తులను సీజ్ చేశారు.

ఆమె కోసం పడరాని పాట్లు
టీవీ ఆర్టిస్టులు కూడా ఒక గ్రూపుగా ఏర్పడి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications