ఉగాది: పంచెకట్టులోచిరంజీవి, పచ్చడి చేదేనా (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు తమ తమ పార్టీ కార్యాలయాల్లో ఉగాది పర్వదినాన్ని నిర్వహించుకున్నారు. చేదూ తీపిలతో కూడిన ఉగాది పచ్చడి తిన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, కాంగ్రెసు పార్టీ నాయకుడు చిరంజీవికి ఈ ఉగాది పచ్చడి చేదుగానే ఉంటుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
ఎన్నికల వేళ రాజకీయ నాయకులకు ఉగాది పచ్చడి షడ్రుచులను పంచి పెట్టింది. ఎన్నికల్లో తమ తమ భవిష్యత్తు కొత్త సంవత్సరంలో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు ఉగాది పర్వదినం జరుపుకుని ఉగాది పచ్చడి రుచి చూశారు.
ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు చిరంజీవి పార్టీ కార్యాలయం ఇందిరా భవన్‌లో జరిగిన ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు. భవిష్యత్తుపై నమ్మకం ఉంచాలని ఆయన సూచించారు.

టీ తెలంగాణ నాయకులు ఇలా..
తెలంగాణ పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేస్తున్న కాంగ్రెసు తెలంగాణ నాయకులు శ్రీధర్ బాబు, తదితరులు ఇలా..

తీపి, చేదు కలయిక..
సర్వే ఫలితాలను బట్టి తెలంగాణ కాంగ్రెసు నాయకులు వచ్చే ఎన్నికల ఫలితాలు సగం తీపిని, సగం చేదును మిగిల్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెసు సగం శాసనసభా స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే తేల్చింది.

శ్రీధర్ బాబుకు చేదేనా..
పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ తిరిగి కాంగ్రెసు గూటికి చేరడం కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకుడు శ్రీధర్ బాబుకు చేదునే తెచ్చి పెడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పంచెకట్టులో చిరంజీవి..
తెలుగు సంప్రదాయం ఉట్టిపడే విధంగా కాంగ్రెసు నాయకుడు, కేంద్ర మంత్రి చిరంజీవి ఇందిరాభవన్‌లో జరిగిన ఉగాది ఉత్సవంలో పాల్గొన్నారు.

భవిష్యత్తుపై చిరంజీవి అశ
ఆశావహులై ఉందాం, ఆశతో జీవిద్దామని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామని ఆయన అన్నారు. ఎవరూ నమ్మకాన్ని కోల్పోవద్దని ఆయన అన్నారు.

ఇందిరా భవన్‌లో పంచాంగ శ్రవణం
కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ పిసిసి కార్యాలయం ఇందిరా భవన్‌లో పంచాంగ పఠనం జరిగింది. సీమాంధ్రలో కాంగ్రెసు పరిస్థితి ఏమిటో మరి.

చిరుకు చేదేనా...
సీమాంధ్రలో కాంగ్రెసు ప్రచార బాధ్యతలను చిరంజీవి భుజాన ఎత్తుకున్నారు. అయితే, ఈ ఏడాది కాంగ్రెసుకు సీమాంధ్రలో చేదు అనుభవమేనని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి.

ప్రసాదం స్వీకరిస్తూ..
ఇందిరా భవన్‌లో జరిగిన ఉగాది ఉత్సవాల్లో కేంద్ర మంత్రి చిరంజీవి ఇలా తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించారు.












Click it and Unblock the Notifications