వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్లూఫిల్మ్స్ నిర్వాకం: శాడిస్టు భర్త చేతిలో భార్య (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ జిల్లాలో భార్యను నిర్బంధించి, నీలి చిత్రాలు చూపిస్తూ నిత్యం వేధిస్తున్న శాడిస్టు భర్త వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. తన శాడిస్టు చేష్టలతో జీవచ్ఛవంలా చేసిన భర్త నుండి తప్పించుకున్న భార్య పుట్టింటికి చేరుకుంది. నర్సంపేట సబ్‌ డివిజనల్‌ పోలీసు కా ర్యాలయానికి తల్లి, బంధువులతో బాధితురాలు గురువారం రాత్రి చేరుకొని తనకు భర్త నుంచి రక్షణ కల్పించి, న్యాయం చేయాలంటూ స్థానిక డీఎస్పీని వేడుకుంది.

ఈ నెల 13న తన మర్డర్‌ కేసుకు ఖర్చుల కోసం పుట్టింటి నుంచి ఐదు లక్షలు తీసుకురావాలని లేదంటే, నిన్ను నీవాళ్లను చంపేస్తానంటూ తిండితిప్పలు లేకుండా గదిలో బంధించి బయట గొళ్లెం పెట్టి వెళ్లేవాడని తెలిపింది.

ఈ నెల 9న భర్త బయటకు వెళ్లిన సమయంలో తన కుమారుడిచే గది గొళ్లెం తీసుకొని పిల్లలతో తప్పించుకొని భిక్షాటన చేసి వచ్చిన డబ్బులతో వచ్చేశానని తెలిపింది. తన భర్తకు శిక్షపడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేదంటే తనను చంపేస్తాడంటూ భార్య వేడుకుంది.

వివాహమైన తర్వాత

వివాహమైన తర్వాత

గూడూరు మండలం బొద్దుగొండకు చెందిన మహ్మద్‌ జిలాని, ఖాజా బేగం దంపతుల కూతురు సమీనాబేగంకు 2009 మార్చిలో రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ లోని ఎన్నంపల్లె ప్రాంతానికి చెందిన షేక్‌ ఖాజాపాషాతో వివాహమైంది.

కొద్ది రోజులు బాగానే..

కొద్ది రోజులు బాగానే..

కొద్ది రోజుల వరకు బాగానే వున్న ఖాజాపాషా తర్వాత భార్య పట్ల శాడిస్ట్‌గా మారాడు. భార్యపై అనుమానంతో ఇంట్లో నర్బంధించాడు. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయేవాడు.

నీలి చిత్రాలు చూపిస్తూ..

నీలి చిత్రాలు చూపిస్తూ..

నీలి చిత్రాలను చూపిస్తూ వికృత చేష్టలతో నిద్రపోనిచ్చేవాడు కాదని భార్య సమీనా బేగం రోదిస్తూ తెలిపింది. తన గర్ల్‌ఫ్రెండ్స్‌కు ఫోన్‌ చేసి వారితో మాట్లాడాలని వేధించేవాడని తెలిపింది.

పిల్లల పరిస్థితి ఏమిటీ..

పిల్లల పరిస్థితి ఏమిటీ..

పిల్లల గురించి కూడా ఆలోచించకుండా శాడిస్టు భర్త జిలానీ భార్యను వేధిస్తూ వచ్చాడు. ఆమె తప్పించుకుని తల్లిగారింటికి చేరుకుంది.

English summary
A woman Sameena Begum from Warangal district alleged that her husband has harassed her locking in the house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X