మహిళపై గ్యాంగ్ రేప్, హత్య: పట్టిచ్చిన రాకీ (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్‌పల్లిలో గల సుమిత్రానగర్‌ బస్‌ షెల్టర్‌లో ఆదివారం ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహిళ గొంతుపై పదునైన వస్తువుతో కోసిన గాయం కనిపించింది. మృతదేహం పక్కన కండోమ్‌ ఉంది.

దుండగులు మహిళపై అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసు జాగిలం రాకీ సంఘటనా స్థలం నుంచి సుమారు మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న కేపీహెచ్‌బీ ఆర్‌ఎస్‌బ్రదర్స్‌ ముందున్న బస్టాప్‌లో ఓ వ్యక్తి వద్దకు వెళ్లి ఆగింది. పోలీసులు అతడ్ని అదుపులో తీసుకుని విచారించగా మహిళను హత్య చేసినట్టు అంగీకరించాడు. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులున్నారని చెప్పాడు.

ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు కూకట్‌పల్లి సబ్‌డివిజన్‌ ఏసీపీ సాయి మనోహర్‌, సీఐ చంద్రకాంత్‌ తెలిపారు. నిందితుడ్ని అదుపులో తీసుకోవడానికి సహాయపడ్డ జాగిలం రాకీకి రివార్డు కోసం సిఫారసు చేస్తున్నట్టు ఏసీపీ తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలియరాలేదని, చుట్టపక్కల వారు ఎవరూ గుర్తుపట్టలేదని తెలిపారు.

మహిళపై రేప్, హత్య

మహిళపై రేప్, హత్య

హైదరాబాదులోని కూకట్‌పల్లి సుమిత్రానగర్ బస్ షెల్టర్ వద్ద ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు రేప్, చేసి ఆ తర్వాత హత్య చేశారు.

రాజును పట్టుకున్న రాకీ

రాజును పట్టుకున్న రాకీ

పోలీసు జాగిలం రాకీ మహిళ హత్య కేసులో రాజు అనే నిందితుడిని గుర్తించింది. దాంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

శవపరీక్ష తర్వాత..

శవపరీక్ష తర్వాత..

శవపరీక్ష నివేదిక వచ్చిన తరువాత హత్యకు గురైన మహిళ పూర్తి వివరాలు తెలుస్తాయని ఎసిపి అన్నారు. సంఘటనా స్థలంలో కూకట్‌పల్లి ఎస్‌ఐలు సురేష్‌, వెంకటన్న, క్రాంతి, వెంకట్‌, శ్రీనివాస్‌రెడ్డి వివరాలు సేకరించారు.

ఇదే జాగిలం..

ఇదే జాగిలం..

నిరుడు నవంబర్ 30వ తేదీన ఎఎస్ రావు నగర్‌లో మహేష్ బ్యాంక్ దోపిడీకి పాల్పడిన బ్యాంక్ ఉద్యోగి బ్రహ్మచారిని కూడా రాకీయే గుర్తించింది.

రాకీకి హ్యాట్పాఫ్

రాకీకి హ్యాట్పాఫ్

రెండు కీలకమైన కేసుల్లో నిందితులను గుర్తించిన జాగిలం రాకీని పోలీసు అధికారులు అభినందించారు. దానికి హ్యాట్సాఫ్ చెప్పారు.

మహిళ హత్య

మహిళ హత్య

కేసులో నిందితుడు రాజు కూకట్‌పల్లిలోని ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన నివాసం ఉంటూ చిత్తుకాగితాలు, ఇనుప సామాను ఏరుకుని జీవనం సాగిస్తుంటాడు. రాకీ అనే జాగిలం అతన్ని పట్టిచ్చింది.

మద్యం సేవించి...

మద్యం సేవించి...

రాజుతో పాటు అతని ఇద్దరు స్నేహితులు మద్యం సేవించి మహిళపై అత్యాచారం చేశారు, ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. శనివారం అర్థరాత్రి మహిళను తీసుకుని వచ్చి ఇద్దరు మిత్రులను పిలిచాడు. వారు ముగ్గురు కలిసి నేరానికి పాల్పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+