వన్ సైడ్ లవ్: అపార్టుమెంట్ పైకెక్కి హల్‌చల్ చేసింది ఇతనే (పిక్చర్స్)

విశాఖపట్నం: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయాలని, లేదంటే దూకేస్తానని అపార్టుమెంట్ పైకి ఎక్కి ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. అతి కష్టం మీద అతన్ని కిందకు దింపిన పోలీసులు అ తర్వాత స్టేషన్‌కు తరలించారు. విశాఖపట్నంలోని ఫొర్త్‌ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో గల అక్కయ్య పాలెం అబిద్ నగర్‌లో బుధవారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఎండాడకు చెందిన కె. అజయ్ (24) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఇంజనీరింగ్ చదివేటప్పటి నుంచి తన క్లాస్‌మెంట్‌ను అతను ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి గురువారం పెళ్లి నిశ్చయమైంది.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో అమ్మాయి నివసిస్తున్న అబిద్ నగర్‌లోని అపార్టుమెంట్‌కు అజయ్ చేరుకున్నాడు. వెంటనే అపార్టుమెంట్ ఐదో అంతస్తు పైకి ఎక్కి హల్‌చల్ చేశాడు.

లేదంటే దూకేస్తా..

లేదంటే దూకేస్తా..

తాను ప్రేమించిన అమ్మాయితో తనకు పెళ్లి చేయకపోతే అపార్టుమెంట్ పైనుంచి దూకేస్తానని అజయ్ హల్‌చల్ చేశాడు.

పెద్ద యెత్తున గుమిగూడారు..

పెద్ద యెత్తున గుమిగూడారు..

ఏం జరుగుతుందో తెలియక పెద్ద యెత్తున స్థానికులు అపార్టుమెంట్ వద్ద గుమిగూడి వింతగా చూస్తూ ఉండిపోయారు.

పోలీసులకు ఫిర్యాదు...

పోలీసులకు ఫిర్యాదు...

అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసు సిబ్బంది, ఫైర్ ఆఫీసర్లు అక్కడికి చేరుకున్నారు.

నచ్చజెప్పి...

నచ్చజెప్పి...

అజయ్‌కి నచ్చజెప్పి పోలీసులు, ఫైర్ సిబ్బంది అతన్ని కిందికి దించేశారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు తరలించరాు.

అమ్మాయి చెప్పలేదు..

అమ్మాయి చెప్పలేదు..

అజయ్‌ని తాను ప్రేమిస్తున్నట్లు అమ్మాయి చెప్పకపోవడం విశేషం. దాంతో అది వన్ సైడ్ లవ్‌గా కొట్టిపారేస్తున్నారు.

దానికే ఇంతనా..

దానికే ఇంతనా..

వన్ సైడ్ లవ్‌కే అజయ్ ఇంత హడావిడి చేసి, అందరినీ కలవరపెట్టాడా అని స్థానికులు విస్తుపోయారు.

గోడపై కూర్చుని..

గోడపై కూర్చుని..

అపార్టుమెంట్ ఐదో అంతస్థులోని గోడపై కూర్చుని అజయ్ అమ్మాయితో తనకు పెళ్లి చేయాలంటూ డిమాండ్ చేశాడు.

దూకేస్తానని ఇలా..

దూకేస్తానని ఇలా..

అమ్మాయితో తనకు పెళ్లి చేయకపోతే పై నుంచి దూకేస్తానంటూ అపార్టుమెంట్ ఐదో అంతస్థుపై నుంచి బెదిరిస్తూ వచ్చాడు.

ఏం చేయాలో తెలియక....

ఏం చేయాలో తెలియక....

ఏం చేయాలో తెలియక పోలీసులు, ఫైర్ సిబ్బంది కాసేపు తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత అతనికి నచ్చజెప్పారు.

పోలీసు స్టేషన్‌కు తరలించారు...

పోలీసు స్టేషన్‌కు తరలించారు...

కిందికి దిగిన తర్వాత అజయ్‌ను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అతని పద్ధతికి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+