జగన్ నామినేషన్: బాబాయ్ వివేకా తోడు (పిక్చర్స్)

కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పులివెందుల శాసనసభా నియోజకవర్గానికి గురువారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. భారీ ర్యాలీతో జగన్ తహశీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చి జగన్ నామినేషన్ దాఖలుచేశారు.

పులివెందుల వచ్చిన జగన్‌ను చూసేందుకు పెద్ద యెత్తున ప్రజలు తరలి వచ్చారు. ఎర్రటి ఎండలో ఆయన ర్యాలీ సాగింది. ర్యాలీకి ముందు ఆయన పులివెందులలోని తండ్రి వైయస్సార్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. ఆయన వెంట ఆయన సతీమణి భారతి, ఇతర కుటుంబ సభ్యులు ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు.

నామినేషన్ వేయడానికి జగన్ పులివెందులలోని ఆంగళ్ల సర్కిల్ వద్ద ఏర్పాటైన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

జగన్‌ను చుట్టుముట్టిన యువత

జగన్‌ను చుట్టుముట్టిన యువత

నామినేషన్ దాఖలు చేయడానికి పులివెందుల వచ్చిన వైయస్ జగన్‌ను యువకులు చుట్టుముట్టారు. ఎర్రటి ఎండలో జగన్ ర్యాలీ జరిగింది.

ఇలా నమస్కారం పెట్టారు..

ఇలా నమస్కారం పెట్టారు..

తనతో పాటు ర్యాలీలో పాల్గొన్న ప్రజలకు వైయస్ జగన్ ఇలా నమస్కారం పెట్టారు. ఆయనతో పాటు ఆయన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి కూడా ఉన్నారు.

గెలిపించాలని వినతి

గెలిపించాలని వినతి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపించి మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని వైయస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

సంక్షేమ పథకాలన్నీ...

సంక్షేమ పథకాలన్నీ...

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ అమల్లోకి తెస్తానని జగన్ హామీ ఇచ్చారు.

కాంగ్రెసు, టిడిపిలపై ధ్వజం

కాంగ్రెసు, టిడిపిలపై ధ్వజం

ఓటు ద్వారా కాగ్రెసు, తెలుగుదేశం పార్టీల కుళ్లును, కుట్రలను తిప్పికొట్టాలని వైయస్ జగన్ ప్రజలకు సూచించారు.

జగన్ ర్యాలీ..

జగన్ ర్యాలీ..

జగన్ ర్యాలీ జూబ్లీ బస్టాప్, నాలుగు రోడ్ల సర్కిల్, తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ఆయన నామినేషన్ దాఖలు చేశారు.

వైయస్ జగన్ ఇలా...

వైయస్ జగన్ ఇలా...

తనతో పాటు ర్యాలీలో పాల్గొన్న ప్రజలకు వైయస్ జగన్ అభివాదం చేశారు. తొలిసారి జగన్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

జగన్ వెనక బాబాయ్ వైయస్ వివేకా..

జగన్ వెనక బాబాయ్ వైయస్ వివేకా..

జగన్ ర్యాలీలో బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ఇలా కనిపించారు. ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు. ఆయన పోటీ చేయడం లేదు.

భవనాలపైకి ఎక్కి జగన్ కోసం..

భవనాలపైకి ఎక్కి జగన్ కోసం..

పులివెందుల ప్రజలను వైయస్ జగన్‌ను చూడడానికి భవనాలు ఎక్కారు. ఆయనను చూడడానికి పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు.

బంతిపూల రెక్కలు..

బంతిపూల రెక్కలు..

వైయస్ జగన్‌పై అభిమానులు బంతిపూల రెక్కలతో వర్షం కురిపించారు. భవనాలపై నుంచి వాటిని జగన్‌పై కురిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+