తల్లితో కలిసి జగన్ ఉగాది వేడుకలు (పిక్చర్స్)

హైదరాబాద్‌: హైదరాబాదులోని లోటస్ పాండ్‌లో గల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో మన్మథ నామ సంవత్సర వేడుకలు శనివారం జరిగాి. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆ తర్వాత మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఆ తర్వాత వేడుకల్లో పాల్గొన్నవారికి ఉగాది పచ్చడి అందించారు. పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నాయకుడు జానా రెడ్డితో పాటు నాయకులు మల్లు భట్టి విక్రమార్క, డి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిరుకూరి శ్రీనివాస మూర్తి పంచాంగ పఠనం చేశారు.

విజయమ్మ ప్రత్యేక పూజలు

విజయమ్మ ప్రత్యేక పూజలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో శనివారం ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా వైయస్ విజయమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు

జగన్ ప్రత్యేక పూజలు

జగన్ ప్రత్యేక పూజలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

జగన్‌కు ఆశీర్వాదాలు..

జగన్‌కు ఆశీర్వాదాలు..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల సందర్బంగా ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఇలా కనిపించారు.

పంచాంగ పఠనం సందర్భంగా...

పంచాంగ పఠనం సందర్భంగా...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఉగాది సందర్భంగా జరిగిన పంచాంగ శ్రవణం సందర్భంగా జగన్, విజయమ్మ ఇలా కనిపించారు.

జగన్ ఇలా..

జగన్ ఇలా..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ఉగాది వేడుకల సందర్భంగా జగన్, విజయమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పచ్చడి సేవిస్తూ...

పచ్చడి సేవిస్తూ...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ఉగాది వేడుకల్లో జగన్ ఓ పాప చేతి మీదుగా పచ్చడి సేవిస్తూ ఇలా కనిపించారు.

విజయసేనా రెడ్డి ఇలా...

విజయసేనా రెడ్డి ఇలా...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న విజయసేనా రెడ్డి పచ్చడి సేవిస్తూ ఇలా కనిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+