అక్కడ అమ్మ: ఇక్కడ జగన్, పెరిగిన జోరు (పిక్చర్స్)
హైదరాబాద్: సమైక్యాంధ్ర క్రెడిట్‌ను కొట్టేయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జోరు పెంచినట్లు కనిపిస్తోంది. సమైక్యాంధ్రకు కట్టుబడిన ఏకైక పార్టీ తమదేనని చెప్పుకోవడానికి ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి జోరు పెంచింది.
రాజీనామాలు ఆమోదింపజేసుకోవడానికి సిద్ధపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చర్యను ఇతర పార్టీలు తీవ్రంగా పట్టాయి. ఈ స్థితిలో వైయస్ జగన్ తన పార్టీ వ్యూహాన్ని మార్చారు. రాజీనామాలను ఆమోదింపజేసుకునే ఆలోచనను పక్కన పెట్టి, సమైక్యాంధ్ర తీర్మానం పెట్టి చర్చించడానికి శాసనసభను ప్రత్యేకంగా సమావేశ పరచాలని డిమాండ్ చేస్తున్నారు.
సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు వైయస్ విజయమ్మ హాజరయ్యారు. ఆమె సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ కట్టుబడి ఉంటుందంటూ చెప్పారు. దానికి తోడు, రాష్ట్ర విభజనకు సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకుబోతున్నట్లు తమకు ముందుగానే సమాచారం అందిందని ఆమె చెప్పారు.
హైదరాబాదులో జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇతర పార్టీల నాయకులను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డిని ఆయన తన పార్టీలోకి తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు.

ఎస్పీవై రెడ్డికి పార్టీ కండువా..
వైయస్ జగన్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి ఎస్పీ వైరెడ్డిని జగన్ పార్టీలోకి తీసుకున్నారు. మరింత మంది ఎంపీలు పార్టీలోకి వస్తారని జగన్ అంచనా వేస్తున్నారు.

స్పీకర్‌తో శాసనసభ్యులు..
సమైక్యాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టడానికి శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరారు. వారు శుక్రవారం స్పీకర్‌ను కలిశారు.

స్పీకర్‌ను కలిసింది వీరే...
స్పీకర్‌ను కలిన వారిలో ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, గొల్ల బాబూరావు, శ్రీకాంత్‌రెడ్డి, కె శ్రీనివాస్, ప్రసన్న కుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అమర్నాధ్‌రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, సుచరిత, తదితరులున్నారు.

వినతిపత్రం ఇదే..
శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు సమర్పించిన వినపతిపత్రం ప్రతి ఇదే.. వ్యూహం మార్చుకుని వారు ప్రత్యేక శాసనసభా సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు.

విజయమ్మతో పాటు శైలజానాథ్..
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు శుక్రవారం చేసిన ధర్నాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు పాల్గొన్నారు. ఆమెతో పాటు రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ పాల్గొనడం విశేషం.

బైబిల్‌తో విజయమ్మ
ఢిల్లీలో సీమాంధ్ర ఉద్యోగుల ధర్నా సందర్భంగా విజయమ్మ ఇలా బైబిల్ చేత బూని కనిపించారు. ఆమె ధర్నా కార్యక్రమంలో కాంగ్రెసు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తప్పు పట్టారు.

విభజన నిర్ణయంపై నిప్పులు
రాష్ట్ర విభజన నిర్ణయంపై వైయస్ విజయమ్మ ధర్నా కార్యక్రమంలో నిప్పులు చెరిగారు. సిడబ్ల్యుసి విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు తమకు ముందుగానే సంకేతాలు అందాయని ఆమె చెప్పారు.

కిరణ్ పార్టీ పెడతారు..
'సమైక్య ఇందిరా కాంగ్రెస్' పేరిట సీఎం కిరణ్ కొత్త పార్టీ పెట్టబోతున్నారని వైయస్ విజయమ్మ ఢిల్లీ ధర్నాలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రణాళికాబద్ధంగా నాయకులందరికీ పదవులు, గనులు ఇచ్చి తెలంగాణ నిర్ణయం తీసుకుందన్నారు.












Click it and Unblock the Notifications