మహిళా పోలీసులుగా సంరక్షణ కార్యదర్శులు-జగన్ సర్కార్ నిర్ణయంపై హైకోర్టులో పిల్
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమించిన వారిని తాజాగా మహిళా పోలీసులుగా మారుస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై నేరాల్ని అరికట్టేందుకు వీలుగా తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో తాజాగా ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది.
మహిళా సంరక్షణ కార్యదర్శులను 'మహిళా పోలీసు'లుగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో 'మహిళ పోలీసు'లుగా పరిగణిస్తూ.. ప్రభుత్వం జారీచేసిన జీవో 59ని సవాలు చేస్తూ హైకోర్టులో ఈ పిల్ దాఖలైంది. ఏపీ పోలీసు చట్టం, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఆ జీవో ఉందని విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు.. ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో 'మహిళ పోలీసు'లుగా పరిగణిస్తూ.. ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 23న జారీచేసిన జీవో 59ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది.

వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 59ని రద్దు చేయాలని కోరుతూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు హైకోర్టులో పిల్ వేశారు. ఏపీ పోలీసు చట్టం, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ జీవో ఉందని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.
పోలీసు శాఖలో జరిగే నియామకాలన్ని పోలీసు నియామక బోర్డు ద్వారా జరగాలన్నారు. అందుకు భిన్నంగా ప్రభుత్వ నిర్ణయం ఉందన్నారు. పోలీసులు విధులు నిర్వర్తించే హోంగార్డులను సైతం పోలీసులుగా పరిగణించరన్నారు. అలాంటిది సచివాలయాల్లో విధులు నిర్వహించే మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడం చట్టవిరుద్ధమని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
మహిళ సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడం, కానిస్టేబుళ్లకు ఉండే అధికారాలు కట్టబెట్టడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జోక్యం చేసుకోవాలని హైకోర్టును కోరారు.
ఈ పిల్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్, ఏపీపీఎస్సీ ఛైర్మన్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications