ఆత్మరక్షణలో వైసీపీ ముఖ్యులు - సీన్ ఛేంజ్..!!
ఎన్నికల్లో విజయం పై సీఎం జగన్ ధీమాగా ఉన్నారు. 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పారు. జగన్ కామెంట్స్ తో అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు విశ్వాసంతో కనిపించారు. అటు టీడీపీ కూటమి లోనే ఇదే తరహా ధీమా కనిపిస్తోంది. జగన్, చంద్రబాబు ఇద్దరూ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇటు కౌంటింగ్ కు సర్వం సిద్దం అవుతోంది. ఈ సమయంలోనే వెలుగులోకి వచ్చిన పోలింగ్ నాటి ఘటన ఇప్పుడు కలకలం గా మారుతోంది. వైసీపీని ఆత్మరక్షణలోకి నెడుతోంది.
హోరా హోరీ పోరు
ఏపీలో ప్రతిష్ఠాత్మకంగా సాగిన పోరులో గెలుపు పైన రెండు ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో మరింత ధీమా పెరిగింది. ఇక..పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింస పైన వైసీపీ నేతలు టీడీపీ కూటమిని టార్గెట్ చేసింది. కూటమి నేతలు ఈసీకి చేసిన ఫిర్యాదులు..వారు సూచించిన అధికారుల నియామకం కారణంగానే హింస జరిగిందని ఆరోపించారు. ఎన్నికల సంఘం పరిశీలకు ల పైన సందేహాలు వ్యక్తం చేసారు. ఈసీ పోలీసు అధికారులను మార్చిన ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదు చేసారు.

ఈసీ సీరియస్
హింస జరిగిన ప్రాంతాల్లో పోలీసు అధికారుల పైన ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. అధికారులను సస్పెండ్ చేసింది. మరి కొందరిని బదిలీపై పంపింది. వైసీపీ..ఎన్నికల హింస టీడీపీ నేతలే చేసారని ఆరోపణలు చేస్తున్న సమయంలో పిన్నెళ్లి వీడియో బయటకు వచ్చింది. పిన్నెళ్లి పాల్వయి గ్రామం లో పోలింగ్ బూత్ లో ఈవీఎం ద్వాంసం చేయడాని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం. ఆయన పైన చర్యలకు ఆదేశించింది. ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. పోలీసులు పిన్నెళ్లి కోసం గాలిస్తున్నారు. టీడీపీ నేతలే విధ్వంసానికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తున్న సమయంలో తమ సొంత పార్టీ ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.

ఆత్మరక్షణలో వైసీపీ
పిన్నెళ్లి ఈ ఘటనకు దిగటానికి ముందు ఆ పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఏజెంట్ ను టీడీపీ నేతలు దాడి చేసి గాయపర్చారని..రిగ్గింగ్ కు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, పిన్నెళ్లి ఇప్పుడు పోలీసులకు దొరకకుండా తప్పించుకోవటం మరింత వివాదంగా మారుతోంది. ఇటు ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో కొన్ని చోట్ల లెక్కంపు తరువాత ఉద్రికత్తత తలెత్తే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో పిన్నెళ్లి ఎపిసోడ్ పైన వైసీపీ ముఖ్యులు ఇప్పటి వరకు స్పందించలేదు. హైదరాబాద్ శివారులో సంగారెడ్డి దగ్గర కార్ వదిలేసి పిన్నెళ్లి తప్పించుకున్నారు. పోలీసులు మొబైల్ సిగ్నల్స్ తో ట్రేస్ చేస్తున్నారు అని మొబైల్ ఫోన్ కూడా కారులోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు వదిలేసినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications