175లో ఆ ఒక్క నియోజకవర్గానికి భారీ డిమాండ్?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా పులివెందుల నుంచి వైఎస్ జగన్ సులభంగా గెలుస్తారని, కుప్పం నుంచి చంద్రబాబు సునాయాస విజయం సాధిస్తారని, హిందూపురం నుంచి టీడీపీ కళ్లుమూసుకొని గెలుస్తుందనే కొన్ని లెక్కలు నియోజకవర్గాలను బట్టి ఉన్నాయి. అయితే ప్రస్తుతం 175 నియోజకవర్గాల్లో ఒకే ఒక నియోజకవర్గానికి మాత్రం భారీగా డిమాండ్ ఏర్పడింది.

75 శాతం ఓటర్లు కాపు సామాజికవర్గమే..!

75 శాతం ఓటర్లు కాపు సామాజికవర్గమే..!


అదేమిటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం. దీనికి కారణం.. పిఠాపురంలో ఉన్న 1,86,682 ఓటర్లలో 75 శాతం ఓటర్లు కాపు సామాజికవర్గానికి చెందినవారు. అది ఈ నియోజకవర్గంలో పోటీచేసే అభ్యర్థుల మీద తీవ్ర ప్రభావం చూపించబోతోంది. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకన్నా జనసేన తరఫునే ఈ టికెట్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది.

కింగ్ మేకర్ గా నిలవాలని..

కింగ్ మేకర్ గా నిలవాలని..

వాస్తవానికి పవన్ కల్యాణ్ కూడా ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను ఇక్కడినుంచి సాధించి కింగ్ మేకర్ గా నిలవాలని ప్రయత్నిస్తున్నారు. చివరి నిముషంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదిరినా పిఠాపురం స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను ఇక్కడి నుంచి పోటీచేయాలని, సులభంగా గెలిపించుకుంటామని పార్టీ నాయకులు ఆహ్వానిస్తున్నారు. అయితే పవన్ పోటీపై ఇంకా స్పష్టత రాలేదు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసనకేనా?

ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసనకేనా?


ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసేనకు విజయావకాశాలున్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేన బాగా పుంజుకోవడంతోపాటు ఆరు శాతం ఓటింగ్ ను 12 శాతానికి పెంచుకుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ తరఫున పెండెం దొరబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడి అల్లుడు పీలా శ్రీధర్ స్వతహాగా వైద్యులు. ఆయన చుట్టుపక్కల గ్రామాల్లో ఉచితంగా వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కల్యాణ్ తో నిరంతరం టచ్ లో ఉన్నారు. ఆయన ఇక్కడి సీటును ఆశిస్తున్నారు. ప్రస్తుత జనసేన ఇన్చార్జిగా ఉన్న మాకినీడి శేషుకుమారి గత ఎన్నికల్లో 28,011 ఓట్లు సాధించారు. టీడీపీ తరఫున పోటీచేసిన వర్మకు 68,470 ఓట్లు సాధించగా, పెండెం దొరబాబుకు 83, 459 ఓట్లు వచ్చి విజేతగా నిలిచారు. అంత భారీగా ఉన్న డిమాండ్ ను ఏ పార్టీ క్యాష్ చేసుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+