పోలింగ్ కేంద్రంలో ఎర్రకండువాతో జనసైనిక్- సినిమా చూపించిన వంగా గీత
Vanga Geetha: ఏపీలో పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలైంది. ఉదయం 11 గంటల వరకు 24 శాతం మేర పోలింగ్ నమోదైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.
Recommended Video

కాకినాడ జిల్లా పిఠాపురంలో పోలింగ్ కొనసాగుతున్న సమయంలో జనసేన కార్యకర్తు ఒకరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. జనసేన నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ ధరించే ఎర్రకండువాను మెడలో వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాడు. జనసేన పోలింగ్ ఏజెంట్‌గా భావిస్తోన్నారాతన్ని.క్యూలో నిల్చున్న మహిళల వద్ద మెడలో ఉన్న ఎర్రకండువాను ప్రదర్శిస్తూ, క్యూలైన్‌ను అదుపు చేస్తూ కనిపించాడు. అదే సమయంలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగ గీత దీన్ని గమనించారు. ఆ ఎర్ర కండువాను తీసేయాలంటూ ఆదేశించారు. లేదంటే తాము కూడా వైఎస్ఆర్సీపీ కండువాలను కప్పుకొని పోలింగ్ స్టేషన్లకు వస్తామని చెప్పారు.

ఆ జనసైనికుడితో వాగ్వివాదానికి దిగారు. ఇది కండువా మాత్రమేనంటూ ఆ జన సైనికుడు వంగ గీతకు చెప్పాడు. ఈ వాగ్వివాదాన్ని గమనించిన విధి నిర్వహణలో ఉన్న ఎన్నికల సిబ్బంది.. అక్కడికి చేరుకుని, మెడలో ఉన్న కండువాను తీసేయించారు. అతన్ని బయటికి పంపించారు.ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వంగా గీతాపై ఆయన పోటీ చేశారు. పవన్ కల్యాణ్‌కు పిఠాపురంలో ఓటు హక్కు లేదు. మంగళగిరిలో ఆయనకు ఓటు ఉంది. అందుకే ఆయన ఇక్కడ తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వచ్చింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications