పిఠాపురం ఫలితంపై టీడీపీ నేత వర్మ సంచలన కామెంట్స్
ఏపీలో ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. ఈ నెల 13 ఎన్నికలు జరగ్గా.. వచ్చే నెల 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.నేతల జాతకం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తం అయ్యాయి. గెలుపుపై ఇరు వర్గాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఏపీలో దాదాపు 81 శాతం ఓటింగ్ జరిగింది. ఇక జూన్ 4న వెలువడనున్న ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా అతృతుగా ఎదురు చూస్తున్నారు.
ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం ఫలితం కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో ఈసారి ఎలాగైన గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. పిఠాపురంలో పవన్ గెలుస్తున్నారంటే దానికి టీడీపీ నేత వర్మనే కారణం. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఎంతో కష్టపడ్డారు.మొదట్లో టికెట్ కేటాయింపు విషయంలో.అలిగిన గాని చంద్రబాబు మాట్లాడటంతో వర్మ ఎన్నికలలో పవన్ గెలుపు కోసం పనిచేయడం జరిగింది.

తాజాగా ఆయన పిఠాపురం ఫలితంపై వర్మ సంచలన కామెంట్స్ చేశారు. పిఠాపురంలో పోలింగ్ శాతం పెరగడం అధికార పార్టీకి మింగుడు పడటం లేదని అన్నారు.దీంతో పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు భారీ ఎత్తున అధికార పార్టీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాలలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఆ విషయాన్ని ధ్రువీకరించిందని పేర్కొన్నారు.దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలని ఎన్నికల అధికారులను ఆయన కోరడం జరిగింది. వైసీపీ ఓడిపోతే పెద్ద ఎత్తున అల్లర్లుకు పాల్పడే అవకాశం ఉందని టీడీపీ నేత వర్మ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.












Click it and Unblock the Notifications