పిఠాపురం వర్మ బర్త్ డే స్పెషల్.. సంచలన పోస్టు.. పవన్ కు షాక్..?

పిఠాపురం.. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేవి రెండు పేర్లు. అవి ఒకటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రెండు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ. అందుకే రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేని క్రేజ్ పిఠాపురం సొంతం. ఎప్పుడూ ఏదో వార్త ఇక్కడ సంచలనాలు రేపుతూనే ఉంటాయి. గతేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మొత్తం 175 స్థానాల్లో.. 164 చోట్ల విజయం సాధించిన విషయం తెలిసిందే.

Pithapuram Varma Showers in Birthday Wishes and Praise

అలాగే పిఠాపురంలో పవన్ కల్యాణ్ రికార్డు విజయం సాధించారు. 51 వేల మెజారిటీతో విజయం సాధించారు. పిఠాపురం ప్రజల దీవెనతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే పవన్ కల్యాణ్ కోసమే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ.. తన పిఠాపురం సీటును త్యాగం చేసిన విషయం తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేర లేదన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఇవాళ పిఠాపురం వర్మ బర్త్ డే సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఆయనకు ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. హ్యాపీ బర్త్ డే వర్మ గారు అని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో ఎస్వీఎస్ఎన్ వర్మ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు. అది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అటు జనసేన నాయకులు, ఇటు టీడీపీ నాయకులు ఆయనకు విషెస్ చెప్తున్నారు.

మరోవైపు వర్మ బర్త్ డే సందర్భంగా ఆయన కుమారుడు పిఠాపురం టీడీపీ యువనాయకుడు గిరిశ్ కీలక పోస్టు పెట్టారు. " పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న.. ఈ రోజు.. నేను మీలో వ్యక్తిని మాత్రమే చూడలేదు.. ఓ నాయకుడు, దార్శనికుడు, ప్రజల గొంతుకను చూశాను. మీ బలం, మీ త్యాగాలు.. మీ కుటుంబం, మీ ప్రజల పట్ల మీకున్న అచంచలమైన నిబద్ధత ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తినిచ్చాయి. నిజమైన నాయకత్వం ఇంట్లోనే ప్రారంభమవుతుందని మీరు నాకు నేర్పించారు. నాకు మార్గదర్శకంగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ సంవత్సరం మీరు కోరుకున్న ప్రేమ, బలం తిరిగి వస్తాయి" అని వర్మ కుమారుడు గిరిశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇక రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ను గెలిపించావ్ అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+